Breaking News

జోరుగా గృహ వినియోగం

Published on Fri, 08/01/2025 - 02:42

ముంబై: భారత్‌లో గృహ వినియోగం వచ్చే రెండు నుంచి మూడు త్రైమాసికాల్లో పుంజుకుంటుందని స్విస్‌ బ్రోకరేజీ సంస్థ యూబీఎస్‌ సెక్యూరిటీస్‌ అంచనా వేసింది. గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం బలపడుతుండడం మద్దతుగా నిలుస్తుందని పేర్కొంది. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఇది కొనుగోలు శక్తిని పెంచుతుందని తెలిపింది. అలాగే మంచి వర్షపాతం అంచనాలు పంటల దిగుబడిపై ఆశలను పెంచుతున్నాయని, మహిళల సామాజిక భద్రతపై ప్రభుత్వాలు 20 బిలియన్‌ డాలర్లు వ్యయం చేస్తుండడం.. ఇవన్నీ గ్రామీణ వినియోగాన్ని బలోపేతం చేస్తాయని తన నివేదికలో యూబీఎస్‌ సెక్యూరిటీస్‌ వివరించింది. 

ఆర్‌బీఐ వడ్డీ రేట్లను తగ్గించడం, వ్యక్తిగత ఆదాయపన్నులో మార్పుల ద్వారా 10 బిలియన్‌ డాలర్ల మేర ఆర్థిక ఉద్దీపనలు కల్పించడం, రుణాల లభ్యత పెరగడం.. ఇవన్నీ పట్టణ వినియోగాన్ని కుదురుకునేలా చేస్తాయని తెలిపింది. ‘‘గ్రామీణ వినియోగం పుంజుకున్నప్పటికీ.. మొత్తం వాటాలో గ్రామీణ వినియోగం సగానికంటే తక్కువగా ఉన్నందున, గృహ వినియోగం అన్ని రకాలుగా కోలుకుందని ఇప్పుడే చెప్పడం తొందరపాటే అవుతుంది. గ్రామీణ వినియోగం క్రమంగా బలపడుతున్న కొద్దీ ఎంతలేదన్నా వచ్చే 2–3 త్రైమాసికాల్లో గృహ వినియోగం పుంజుకోవడం మొదలవుతుంది’’ అని యూబీఎస్‌ సెక్యూరిటీస్‌ భారత ముఖ్య ఆర్థికవేత్త తన్వీ గుప్తా జైన్‌ తెలిపారు.  

మాస్‌ మార్కెట్లో స్తబ్దత 
గ్రామీణ మార్కెట్లలో చౌక ఉత్పత్తుల వినియోగంలో స్తబ్దత నెలకొనగా, ప్రీమియం ఉత్పత్తుల అమ్మకాలు మాత్రం పెరుగుతున్నట్టు యూబీఎస్‌ సెక్యూరిటీస్‌ వెల్లడించింది.  గ్రామీణ వేతనాల్లో వృద్ధి (ఆహార ద్రవ్యోల్బణంతో సర్దుబాటు చేసిన) ఆరేళ్ల గరిష్ట స్థాయి అయిన 4.5 శాతానికి చేరుకున్నట్టు తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో ద్విచక్ర వాహన అమ్మకాలు జూన్‌ త్రైమాసికంలో 9 శాతం, ట్రాక్టర్ల అమ్మకాలు 35 శాతం చొప్పున పెరిగినట్టు పేర్కొంది. పట్టణ ప్రాంతాల్లో ప్యాసింజర్‌ కార్ల అమ్మకాలు, డ్యూరబుల్స్‌ గూడ్స్‌ ఉత్పత్తి మాత్రం జూన్‌ త్రైమాసికంలో తగ్గినట్టు తెలిపింది. ఎనిమిదో వేతన కమిషన్‌ సిఫారసులకు అనుగుణంగా 2026 నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు 55 బిలియన్‌ డాలర్ల చెల్లింపులు మొదలైతే అప్పుడు పట్టణ డిమాండ్‌ సైతం ఊపందుకుంటుందని అంచనా వేసింది.   
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)