Breaking News

డ్రైవర్ల డేటా అమెరికాకి.. ‘రూ. 2,718 కోట్లు ఫైన్‌ కట్టండి’

Published on Mon, 08/26/2024 - 16:48

ప్రముఖ అమెరికన్‌ మల్టీ నేషనల్‌ రవాణా సంస్థ ఉబెర్‌పై నెదర్లాండ్స్‌ కొరడా ఝుళిపించింది. యూరోపియన్ డ్రైవర్ల వ్యక్తిగత డేటాను అమెరికా సర్వర్‌లకు చేరవేయడంపై డచ్‌ డేటా ప్రొటెక్షన్ అథారిటీ (డీటీఏ) 290 మిలియన్ యూరోలు (సుమారు రూ. 2,718 కోట్లు) భారీ జరిమానా విధించింది.

డ్రైవర్ సమాచారాన్ని రక్షించడంలో ఉబెర్‌ విఫలమైందని, ఇలా డ్రైవర్ల సమాచారాన్ని చేరవేయడం యూరోపియన్ యూనియన్ జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ (జీడీపీఆర్‌) ప్రకారం "తీవ్రమైన ఉల్లంఘన" అని డీటీఏ పేర్కొంది. "యూఎస్‌కు డేటా బదిలీకి సంబంధించి ఉబెర్‌ జీడీపీఆర్‌ నిబంధనలు పాటించలేదు. ఇది చాలా తీవ్రమైనది" అని డచ్ డేటా ప్రొటెక్షన్ అథారిటీ  ఛైర్మన్ అలీడ్ వోల్ఫ్‌సెన్ ఒక ప్రకటనలో తెలిపారు.

యూరోపియన్ డ్రైవర్లకు సంబంధించిన టాక్సీ లైసెన్స్‌లు, లొకేషన్ డేటా, ఫోటోలు, చెల్లింపు వివరాలు, గుర్తింపు పత్రాలతోపాటు కొన్ని సందర్భాల్లో డ్రైవర్ల క్రిమినల్‌, మెడికల్‌ డేటాను సైతం ఉబెర్‌ సేకరించిందని డీపీఏ తెలిపింది. సరైన నిబంధనలు పాటించకుండా రెండేళ్ల వ్యవధిలో ఉబెర్‌ ఈ సమాచారాన్ని తమ యూఎస్‌ ప్రధాన కార్యాలయానికి చేరవేసిందని ఆరోపించింది. అయితే ఈ జరిమానాపై అప్పీల్ చేస్తామని ఉబెర్ తెలిపింది. "ఇది లోపభూయిష్ట నిర్ణయం. అసాధారణ జరిమానా పూర్తిగా అన్యాయమైనది" అని ఉబెర్ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు.

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)