Breaking News

యువతకు బెస్ట్‌ పెట్టుబడి మార్గాలు

Published on Mon, 06/16/2025 - 15:23

పెట్టుబడి విషయానికి వస్తే యువతకు, వయసుపైబడిన వారికి మధ్య ఉన్న తేడా ఇన్వెస​్‌మెంట్లను ముందుగా ప్రారంభించడం. యువతకు దీర్ఘకాలంలో ఇది ఎంతో కలిసొస్తుంది. 40-45 ఏళ్లు దాటిన వారితో సమానంగా యువత ఏదైనా పథకంలో పెట్టుబడి పెట్టి ఒకే సమయంలో ఉపసంహరించుకుంటే కచ్చితంగా యువతకు ఎంతో లాభం చేకూరుతుంది. అయితే ఎలాంటి పథకాల్లో పెట్టుబడి ప్రారంభించాలో స్పష్టత ఉండడంలేదు. యువకులు క్రమశిక్షణతో, ఆర్థిక నిపుణుల సలహాతో మంచి పథకంలో పెట్టుబడి ప్రారంభిస్తే ఆకర్షణీయ రాబడిని అందుకోవచ్చు. మార్కెట్‌లోని కొన్ని పథకాల గురించి తెలుసుకుందాం.

పొదుపు ఖాతాలు, డిపాజిట్ సర్టిఫికెట్లు (సీడీలు)

పొదుపు ఖాతా అనేది డబ్బును నిర్వహించేందుకు సరళమైన, అత్యంత రిస్క్ లేని మార్గం. అయితే ఇందులో వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నప్పటికీ ఈ ఖాతాలు సురక్షితమైనవి. మరోవైపు సీడీలు మీ డబ్బును నిర్ణీత కాలానికి (6 నెలలు లేదా ఒక సంవత్సరం) లాక్ చేస్తాయి. అందుకు కొంత అధిక మొత్తంలో రాబడిని అందిస్తాయి.

స్టాక్ మార్కెట్

స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టడం ఆకర్షణీయంగా, ఆసక్తికరంగా ఉంటుంది. మంచి కంపెనీని ఎంచుకొని పెట్టుబడి కొనసాగిస్తే కాలక్రమేణా అధిక రాబడిని అందించగలవు. అయితే ఇవి అస్థిరంగా ఉంటాయని గుర్తుంచుకోవాలి. వీటిలో రిస్క్‌ అధికంగా ఉంటుందని మరిచిపోకూడదు.

ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్), మ్యూచువల్ ఫండ్స్

ఈటీఎఫ్‌లు, మ్యూచువల్ ఫండ్‌ స్టాక్స్‌లో నిర్ణీత షార్ట్‌టర్మ్‌లో ఒడిదొడుకులు ఉన్నప్పటికీ లాంగ్‌టర్మ్‌లో మంచి రాబడిని అందిస్తాయి. అయితే ఇందుకు పెట్టుబడులను కొనసాగించాల్సి ఉంటుంది. ఈటీఎఫ్‌లు(కొన్ని స్టాక్స్‌ కలిపి ఉన్న ఫండ్‌) మార్కెట్‌లో నేరుగా లైవ్‌లో ట్రేడవుతాయి. మ్యూచువల్ ఫండ్స్‌ కూడా సెక్టార్‌ వారీగా స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తాయి. వాటిని నిత్యం ఫండ్‌ మేనేజర్‌ నిర్వహిస్తుంటారు.

బాండ్స్‌

బాండ్లు అంటే కాలానుగుణ వడ్డీ చెల్లింపుల కోసం కంపెనీలు లేదా ప్రభుత్వాలకు ఇచ్చే రుణాలు. ఇవి స్టాక్స్ కంటే సురక్షితమైనవి. కానీ, తక్కువ రాబడిని అందిస్తాయి.

రియల్ ఎస్టేట్ (ఆర్ఈఐటీ)

రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్టులు (ఆర్ఈఐటీలు) యువ పెట్టుబడిదారులను భౌతిక ఆస్తిని కొనుగోలు చేయకుండానే రియల్ ఎస్టేట్ పెట్టుబడుల నుంచి డివిడెండ్‌ సంపాదించడానికి వీలు కల్పిస్తాయి. వీటిని చాలా బ్రోకరేజీ ఖాతాల ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఇన్వెస్ట్‌మెంట్‌ పోర్ట్‌ఫోలియోను వైవిధ్యపరచడానికి ఇది మంచి మార్గాన్ని అందిస్తుంది.

ఇదీ చదవండి: హోర్ముజ్ జలసంధి మూసివేత..?

విద్య, నైపుణ్యాలు

విద్య, సర్టిఫికేషన్లు లేదా అధిక ఆదాయాన్ని సమకూర్చే నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం (కోడింగ్, డిజైన్ వంటివి) కోసం పెట్టుబడి పెట్టడం అన్నింటికంటే మంచి ఇన్వెస్ట్‌మెంట్‌. దీన్ని ఎంత త్వరగా ప్రారంభిస్తే కెరియర్‌లో అంత ప్రయోజనం పొందుతారు.

Videos

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)