Breaking News

రెపో రేటు పెంపును వ్యతిరేకించిన ఆ ఇద్దరు ఎంపీసీ సభ్యులు!

Published on Thu, 02/23/2023 - 07:35

ముంబై: బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు రెపో ఇటీవలి పావుశాతం పెంపునకు గవర్నర్‌ శక్తికాంతదాస్‌ నేతృత్వంలోని ఆరుగురు  సభ్యుల ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ)లో ఇరువురు ఇరువురు వ్యతిరేకించారు. గవర్నర్‌సహా నలుగురు పెంపునకు అనుకూలంగా ఓటు చేశారు.  ద్రవ్యోల్బణం భయాలతో ఈ నెల మొదట్లో రెపో పావుశాతం పెరిగి 6.5 శాతానికి చేరిన సంగతి తెలిసిందే.

ఎంపీసీ ఆరుగురు  సభ్యుల్లో గవర్నర్‌తోపాటు డిప్యూటీ గవర్నర్‌ మైఖేల్‌ దేబబ్రత పాత్ర, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రాజీవ్‌ రంజన్, ముగ్గురు ప్రభుత్వం నామినేట్‌ చేసిన– ఎక్స్‌టర్నర్‌ సభ్యులు –– శశాంక భిడే, అషిమా గోయల్, జయంత్‌ ఆర్‌ వర్మలు ఉన్నారు. వీరిలో వర్మ గోయల్‌లు ఇరువురూ రేటు పెంపును వ్యతిరేకించినట్లు బుధవారం వెలువరించిన మినిట్స్‌ తెలిపాయి.

ద్రవ్యోల్బణం కట్టడిలోకి వస్తున్నందున, రేటు పెంపునకు బదులుగా వృద్ధికే ప్రాధాన్యత ఇవ్వాలని వీరు అభిప్రాయపడ్డారు. అక్టోబర్‌ వరకూ గడచిన 10 నెలల్లో  రెపో రేటు నిర్ణయానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం ఆర్‌బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న ఆరు శాతంపైబడి కొనసాగిన సంగతి గమనార్హం. నవంబర్, డిసెంబర్‌లలో ఇది 6 శాతం దిగువకు చేరడం ఇరువురు సభ్యుల అభిప్రాయాల నేపథ్యం.

Videos

ఆపరేషన్ సిందూర్ పై మోదీ కీలక ప్రకటన

అమెరికా, చైనా మధ్య టారిఫ్ వార్ కు బ్రేక్..

గిల్ కోసం కోహ్లి బలి.. ఇదంతా గంభీర్ కుట్ర!

జమ్మూలోని సరిహద్దు గ్రామాలపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్

స్పీడ్ పెంచిన మెగా స్టార్.. యంగ్ డైరెక్టర్స్ తో వరుసగా సినిమాలు

రాజమౌళి సెంటిమెంట్ కి భయపడుతున్న మహేష్ బాబు

ఉగ్రవాదులతోనే మా పోరాటం

భారత్, పాకిస్థాన్ DGMOల భేటీ వాయిదా

దేశంలో 32 విమానాశ్రయాలు రీఓపెన్

బాహుబలి చేప

Photos

+5

గంగమ్మ జాతరలో మంచు మనోజ్ దంపతులు (ఫొటోలు)

+5

మదర్స్‌ డే స్పెషల్.. అమ్మలతో సెలబ్రిటీల పోజులు (ఫొటోలు)

+5

లండన్ లో రామ్ చరణ్ మైనపు విగ్రహం.. తొలి నటుడిగా రికార్డ్ (ఫొటోలు)

+5

నందమూరి తారక రామారావు ఎంట్రీ సినిమా పూజా కార్యక్రమం (ఫోటోలు)

+5

తిరుపతి: గంగమ్మ జాతర.. మాతంగి వేషంలో అమ్మవారిని దర్శించుకున్న భక్తులు (ఫొటోలు)

+5

విశాఖపట్నం : ఆర్కే బీచ్‌లో సందర్శకుల సందడే సందడి (ఫొటోలు)

+5

యాదగిరిగుట్టలో గిరి ప్రదక్షిణ.. భారీగా పాల్గొన్న భక్తులు (ఫొటోలు)

+5

వీరజవాన్‌ మురళీ నాయక్‌ అంతిమ వీడ్కోలు.. జైహింద్‌.. అమర్‌రహే నినాదాలు (ఫొటోలు)

+5

‘లెవన్‌’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

మిస్‌ వరల్డ్‌ : అందాల ముద్దుగుమ్మలు సందడి.. (ఫొటోలు)