ఈ స్కూటర్‌ను 18 లక్షల మంది కొనేశారు

Published on Sun, 02/09/2025 - 21:19

టీవీఎస్ ఎన్‌టార్క్ 125 (TVS Ntorq 125) అమ్మకాల్లో అరుదైన మైలురాయిని చేరుకుంది. 2024 డిసెంబర్ చివరి నాటికి కంపెనీ 18,88,715 యూనిట్లను విక్రయించింది. దీంతో హోండా యాక్టివా, టీవీఎస్ జుపిటర్, సుజుకి యాక్సెస్ తరువాత.. ఎన్‌టార్క్ 125 అత్యధికంగా అమ్ముడైన నాల్గవ స్కూటర్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది.

టీవీఎస్ మోటార్ 2018 ప్రారంభంలో ఎన్‌టార్క్‌ను ప్రవేశపెట్టింది. ఆ సమయంలో భారతదేశంలో 125సీసీ స్కూటర్లకు మంచి డిమాండ్ ఉండేది. అప్పటి నుంచి కంపెనీ దీనిని అప్డేట్ చేస్తూ.. కొత్త వేరియంట్‌లను ప్రవేశపెడుతూనే ఉంది. కంపెనీ అమ్మకాలు పెరగడానికి కూడా ఈ స్కూటర్ దోహదపడింది.

ఎన్‌టార్క్‌ స్కూటర్ బేస్ (డ్రమ్/డిస్క్), రేస్ ఎడిషన్, సూపర్ స్క్వాడ్ ఎడిషన్, రేస్ XP, రేస్ XT అనే ఆరు వేరియంట్లలో లభిస్తుంది. దీని ధరలు రూ. 84,600 నుంచి రూ. 1,04,600 (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. రేస్ XP ఎడిషన్ 10.2 హార్స్ పవర్, 10.8 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తే.. మిగిలిన వేరియంట్స్ 9.4 హార్స్ పవర్, 10.5 ఎన్ఎమ్ టార్క్ అందిస్తాయి.

ఇదీ చదవండి: సరికొత్త ఫీచర్లతో.. వచ్చేస్తోంది యాక్టివా 7జీ

ఇండియన్ మార్కెట్లో మాత్రమే కాకుండా.. విదేశాల్లో కూడా 'ఎన్‌టార్క్‌'కు మంచి డిమాండ్ ఉంది. ఈ కారణంగానే కంపెనీ 2024 ఏప్రిల్ - డిసెంబర్ మధ్య 50640 ఎన్‌టార్క్‌ స్కూటర్లను ఎగుమతి చేసింది. ఇవి అంతకు ముందు ఏడాది కంటే 16 శాతం ఎక్కువ. దీన్ని బట్టి చూస్తే దీనికి గ్లోబల్ మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)