Breaking News

24 గంటల్లో 1618 కిమీ ప్రయాణించిన స్కూటర్

Published on Thu, 05/22/2025 - 19:26

ప్రముఖ వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్.. ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసిన 'టీవీఎస్ ఎన్‌టార్క్ 125' మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. ఈ స్కూటర్ ఇటీవల 'ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్'లో అనేక రికార్డులను బద్దలు కొట్టింది.

2025 మే 4న నోయిడాలోని సెక్టార్-38 నుంచి ప్రారంభమైన రైడ్‌ను ప్రారంభించి 15 గంటల్లోపు దాదాపు 1000 కి.మీ. రైడ్‌ను పూర్తి చేసి, మొదటి రికార్డును బద్దలు కొట్టింది. ఆ తరువాత కొందరు రైడర్లు.. కేవలం 24 గంటల్లో 1618 కిమీ దూరాన్ని ఈ స్కూటర్‌పై ప్రయాణించి మరో రికార్డ్ క్రియేట్ చేశారు. ఈ స్కూటర్ ఢిల్లీ-ఆగ్రా, ఆగ్రా-లక్నో & లక్నో-అజమ్‌గఢ్‌లతో సహా మల్టిపుల్ ఎక్స్‌ప్రెస్‌వేల గుండా ప్రయాణించింది.

రైడింగ్ కోసం ఉపయోగించిన వేరియంట్స్ టాప్ ఎండ్ వేరియంట్స్ అయిన.. ఎన్‌టార్క్ రేస్ ఎక్స్‌పీ, డిస్క్, రేస్ ఎడిషన్, సూపర్ స్క్వాడ్, ఎక్స్‌టీ ఉన్నాయి. పర్ఫామెన్స్ బేస్డ్ స్కూటర్ ధరలు రూ. 87542 నుంచి రూ. 1.07 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి.

ఇదీ చదవండి: రూ.6.89 లక్షలకే కొత్త కారు!.. జూన్ 2 నుంచి బుకింగ్స్

టీవీఎస్ ఎన్‌టార్క్ 125 స్కూటర్ 125 సీసీ ఇంజిన్ ద్వారా 10 Bhp పవర్ 10.9 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 8.6 సెకన్లలో గంటకు 0 నుంచి 60 కిమీ వరకు వేగవంతమయ్యే ఈ స్కూటర్ టాప్ స్పీడ్ 95 కిమీ/గం. డిజైన్, ఫీచర్స్ పరంగా ఇది చాలా అద్భుతంగా ఉంటుంది.

Videos

నా లేఖ లీక్ వెనుక పెద్ద కుట్ర ఉంది..

బెంగళూరుపై హైదరాబాద్ విజయం

అప్పుల కుప్ప అమరావతి

హరికృష్ణకు పోలీసుల వేధింపులపై YS జగన్ ఫైర్

వల్లభనేని వంశీని చంపేస్తారా..!

వల్లభనేని వంశీకి అస్వస్థత

సారీ బాబు గారు.. ఇక్కడ బిల్డింగులు కట్టలేం

కవిత లేఖ ఓ డ్రామా: బండి సంజయ్

హైదరాబాద్ లో కరోనా కేసు నమోదు

జహీరాబాద్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: సీఎం రేవంత్

Photos

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)