TVS iQube vs Orbiter: ఏది బెస్ట్? ధర, రేంజ్ పూర్తి వివరాలు!

Published on Sat, 07/25/2026 - 19:19

ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో లెక్కకు మించిన ఎలక్ట్రిక్ స్కూటర్లు అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. అయితే టీవీఎస్ కంపెనీకి చెందిన ఐక్యూబ్, ఆర్బిటర్ ఈవీలలో ఏదైనా కొనాలనుకుంటే.. వీటి ధరలు, రేంజ్ వంటి వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

ధరలు
టీవీఎస్ ఐక్యూబ్ ధర రూ.1.15 లక్షల నుంచి రూ.1.73 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. ఆర్బిటర్ ధర రూ.91,550 నుంచి రూ.1.15 లక్షల మధ్య ఉంది. ధర మధ్య వ్యత్యాసం రూ.20 వేల నుంచి రూ.30వేలు మాత్రమే. కానీ కొంత తక్కువ ధరలో కావాలంటే ఆర్బిటార్ మంచి ఎంపిక.

పెర్ఫామెన్స్ 
టీవీఎస్ ఐక్యూబ్ కేవలం 4.2 సెకన్లలో 0 నుంచి 40 కి.మీ/గం వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం 75 నుంచి 82 కి.మీ/గం వరకు ఉంటుంది, అందువల్ల ఇది హైవే, సుదూర ప్రయాణాలకు మంచి ఎంపికగా నిలుస్తుంది.

టీవీఎస్ ఆర్బిటర్ రోజువారీ నగర వినియోగం కోసం ఉపయోగపడుతుంది. ఇది సుమారుగా 6.3 సెకన్లలో 0 నుంచి 40 కి.మీ/గం వేగాన్ని అందుకుంటుంది. టాప్ స్పీడ్ 68 కి.మీ/గం. నగర ట్రాఫిక్‌లో చాలా మందికి ఈ వేగం సరిపోతుంది.

రేంజ్
టీవీఎస్ ఐక్యూబ్ వివిధ బ్యాటరీ ప్యాక్‌లతో వస్తుంది. కాబట్టి దీని రేంజ్ సుమారుగా 74 కి.మీ నుంచి 212 కి.మీ వరకు ఉంటుంది. ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ పెద్ద బ్యాటరీ వేరియంట్ సుమారుగా 158 కి.మీ రేంజ్‌ను అందిస్తుందని సమాచారం. స్టోరేజ్ విషయంలో ఆర్బిటర్‌ 34 లీటర్ల స్పేస్‌ అందిస్తుంది. టీవీఎస్ ఐక్యూబ్ 32 లీటర్లను అందిస్తుంది.

ఫీచర్స్
ప్రీమియం అనుభూతిని కోరుకునే వినియోగదారులకు టీవీఎస్ ఐక్యూబ్ మంచి ఎంపిక అవుతుంది. ఇది పెద్ద డిస్‌ప్లే, అత్యుత్తమ ఫినిషింగ్, శక్తివంతమైన మోటార్, వేగవంతమైన యాక్సిలరేషన్‌ను అందిస్తుంది. కుటుంబ వినియోగం, సుదూర ప్రయాణాలు చేసే వారికి ఇది మంచి ఎంపిక. అయితే ఆర్బిటర్ కొన్ని తక్కువ ఫీచర్స్ పొందుతుంది.

కొంత ఎక్కువ బడ్జెట్ వెచ్చించి.. మెరుగైన పనితీరు, ప్రీమియం ఫీచర్లు కావాలనుకుంటే టీవీఎస్ ఐక్యూబ్ సరైన ఎంపిక. కానీ తక్కువ ధరలో మంచి మైలేజ్, తగినంత రేంజ్, ప్రాక్టికాలిటీని కోరుకుంటే ఆర్బిటర్ ఎందుకోవడం ఉత్తమం.

Videos

వైరల్ వీడియో వోడ్కా తాగి వైన్స్ లోనే పడుకున్న కోతి

మంత్రి నారాయణ పై సిట్ విచారణ జరపాలి అమరావతి రైతుల కీలక డిమాండ్

ఊహించని ఊచకోత.. అప్పుడే రూ.100 కోట్లు

దానంకు ఖైరతాబాద్ టికెట్ టెన్షన్

కర్నూలులో పట్టపగలే చోరీ.. రైతు బైక్ నుంచి రూ.2 లక్షలు మాయం

చింతమనేని నీకే చెప్తున్నా దెందులూరు గడ్డ సాక్షిగా.. నెక్స్ట్ లెవెల్ వార్నింగ్

గణేష్ నిమజ్జనంలో దుమ్మురేపిన హైదరాబాద్ లేడీ పోలీస్ డాన్స్

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

మధుబాబును సస్పెండ్ చేసిన కూటమి ప్రభుత్వం ఉద్యోగ సంఘాల ఆగ్రహం

ఉండ్రాజవరంలో హైటెన్షన్.. పోలీసులకు వంగవీటి కూతురు మాస్ వార్నింగ్

Photos

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)

+5

చూడప్పా సిద్ధప్పా.. సింహం గడ్డం గీసేసిందప్పా! (ఫొటోలు)

+5

'సిగ్మా' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

ఖైరతాబాద్ గణేశుడి సేవలో టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)

+5

హైదరాబాదులో వినాయక నిమజ్జనం సందడి..(ఫొటోలు)

+5

ఖైరతాబాద్‌ మహా గణపతి నిమజ్జనం దృశ్యాలు..(ఫొటోలు)