Breaking News

ఐపీవోకి మరో రెండు కంపెనీలు

Published on Sun, 09/07/2025 - 11:15

ఇన్సూరెన్స్‌ టెక్నాలజీ సంస్థ టర్టిల్‌మింట్‌ ఫిన్‌టెక్‌ తాజాగా పబ్లిక్‌ ఇష్యూకి రానుంది. ఇందుకు సంబంధించిన పత్రాలను ప్రీ–ఫైలింగ్‌ విధానంలో మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించింది. ఐసీఐసీఐ సెక్యూరిటీస్, జెఫ్రీస్‌ ఇండియా తదితర సంస్థలు ఈ ఇష్యూకి మర్చంట్‌ బ్యాంకర్లుగా వ్యవహరిస్తున్నాయి.

2015లో ధీరేంద్ర మాహ్యవంశి, ఆనంద్‌ ప్రభుదేశాయ్‌ కలిసి టర్టిల్‌మింట్‌ను ప్రారంభించారు. బీమా పాలసీల కొనుగోలు, నిర్వహణ ప్రక్రియను సరళతరం చేసే లక్ష్యంతో కంపెనీ ఏర్పాటైంది. అయిదు లక్షల మంది పైగా అడ్వైజర్లతో సంస్థ దాదాపు 1.6 కోట్ల పాలసీలను విక్రయించింది. ఇందులో అమాన్సా క్యాపిటల్, నెక్సస్‌ వెంచర్‌ పార్ట్‌నర్స్‌ మొదలైన సంస్థలు ఇన్వెస్ట్‌ చేశాయి.

రూ. 499 కోట్ల సుప్రీత్‌ కెమికల్స్‌ ఐపీవో

సుప్రీత్‌ కెమికల్స్‌ సంస్థ ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీవో) ద్వారా రూ. 499 కోట్లు సమీకరించనుంది. ఇందుకోసం మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ దాఖలు చేసింది. ఐపీవో పూర్తిగా తాజా షేర్ల జారీ రూపంలో ఉంటుందని కంపెనీ తెలిపింది.

ఇష్యూ ద్వారా సమీకరించిన నిధుల్లో రూ. 310 కోట్లను కొత్త ప్రాజెక్టు ఏర్పాటుకు, మరో రూ. 65 కోట్ల మొత్తాన్ని రుణాలు చెల్లింపునకు సంస్థ వినియోగించుకోనుంది. 2025 మార్చి ఆఖరు నాటికి కంపెనీ మొతత్తం రుణభారం రూ. 200 కోట్లుగా ఉంది. ప్రీ–ఐపీవో ప్లేస్‌మెంట్‌ ద్వారా సుప్రీత్‌ కెమికల్స్‌ రూ. 99 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. అలా సమీకరిస్తే తాజా షేర్ల జారీ తగ్గుతుంది.

గుజరాత్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సుప్రీత్‌ కెమికల్స్‌ ప్రధానంగా స్పెషాలిటీ కెమికల్‌ ఇంటరీ్మడియట్స్‌ను తయారు చేస్తోంది. టెక్స్‌టైల్స్, ఫార్మా, ఆగ్రో–కెమికల్స్‌ తదితర పరిశ్రమలకు అవసరమయ్యే ఉత్పత్తులను అందిస్తోంది. 2024లో 1,309 బిలియన్‌ డాలర్లుగా ఉన్న గ్లోబల్‌ స్పెషాలిటీ కెమికల్స్‌ ఇంటరీ్మడియట్స్‌ మార్కెట్‌ 2029 నాటికి 1,802 బిలియన్‌ డాలర్లకు చేరుతుందనే అంచనాలు ఉన్నాయి.

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)