Breaking News

దివాలా అంచున దిగ్గజ కంపెనీ!

Published on Tue, 09/17/2024 - 19:49

గృహోపకరణాలు, ఆహార నిల్వ కోసం ఉపయోగించే వస్తువులను విక్రయించే అమెరికన్ కంపెనీ 'టప్పర్‌వేర్' (Tupperware) దివాలా అంచున ఉన్నట్లు సమాచారం. ఒకప్పుడు ప్లాసిక్ బాక్సుల తయారీలో విప్లవం సృష్టించిన కంపెనీ నేడు కష్టకాలంలో ఉన్నట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదించింది.

ఈ విషయం తెలిసిన తరువాత న్యూయార్క్‌లో మధ్యాహ్నం కంపెనీ షేర్లు 50 శాతం కంటే ఎక్కువ పడిపోయాయి. 1946లో రసాయన శాస్త్రవేత్త ఎర్ల్ టప్పర్ స్థాపించిన ఈ కంపెనీ 1950లలో అధిక ప్రజాదరణ పొందుతూ ముందుకు సాగింది. కరోనా మహమ్మారి సమయంలో కూడా మంచి అమ్మకాలను పొందిన ఈ సంస్థ అమ్మకాలు 2024 త్రైమాసికంలో క్షీణించాయి.

టప్పర్‌వేర్ దాని రుణ నిబంధనలను ఉల్లంఘించిన తర్వాత కోర్టు రక్షణలోకి ప్రవేశించాలని యోచిస్తోంది. అంతే కాకుండా 700 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ రుణాలను ఎలా నిర్వహించాలనే దానికి సంబంధించిన చర్చలు కూడా జరుపుతున్నట్లు సమాచారం.

ఇదీ చదవండి: కంపెనీలో సమస్యలు!.. సత్య నాదెళ్ల కీలక విషయాలు

గత కొంత కాలం నుంచి ఆశించిన స్థాయిలో అమ్మకాలతో ముందుకు సాగకపోవడంతో.. కంపెనీ ఆర్థిక సమతుల్యతను దృష్టిలో ఉంచుకుని జూన్‌లో 150 మంది ఉద్యోగులను తొలగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. అంతే కాకుండా కంపెనీకి పూర్వ వైభవం తీసుకురావాలనే ఉద్దేశ్యంతో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మిగ్యుల్ ఫెర్నాండెజ్, పలువురు బోర్డు సభ్యులను భర్తీ చేసింది. అయినప్పటికీ పరిస్థితులు తారుమారయ్యాయి. దివాళాకు సంబంధించి కంపెనీ ఇంకా అధికారిక ప్రకటన వెల్లడించలేదు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)