Breaking News

కేర్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌కు TSHA షాక్‌!

Published on Tue, 07/21/2026 - 16:06

కేర్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ద్వారా లబ్ధిదారులకు అందించే క్యాష్‌లెస్‌ వైద్య సేవలను తక్షణమే నిలిపివేస్తున్నట్లు తెలంగాణ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌ (టీఎస్‌హెచ్‌ఏ) ప్రకటించింది.

క్లెయిమ్‌ల తిరస్కరణ, చెల్లింపుల్లో నిబంధనలకు విరుద్ధంగా కోతలు విధించడం, తీవ్రమైన జాప్యం, ముందస్తు సమాచారం లేకుండా ఆస్పత్రులను ప్యానెల్‌ నుంచి తొలగించడం వంటి చర్యలకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు కేర్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ మనీష్‌ దొడేజాకు టీఎస్‌హెచ్‌ఏ లేఖ ద్వారా నోటీసు పంపింది.

వివిధ సమస్యలపై సంస్థతో చర్చించేందుకు ఎన్నిసార్లు ప్రయత్నించినా సంబంధిత వ్యక్తుల నుంచి ఎలాంటి స్పందన రాలేదని అసోసియేషన్‌ ప్రతినిధులు పేర్కొన్నారు. ఫలితంగా ఆస్పత్రుల నిర్వహణ, వైద్య సేవలందింపు కష్టంగా మారడంతోనే క్యాష్‌లెస్‌ సేవలను నిలిపివేయాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. లబ్ధిదారులు ఇకపై రీయింబర్స్‌మెంట్ పద్ధతిలోనే వైద్య సేవలు పొందవచ్చని సూచించారు.

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి