ట్రెసా నుంచి వీ0.1 ఎలక్ట్రిక్‌ ట్రక్‌

Published on Sat, 07/08/2023 - 06:23

హైదరాబాద్‌: ట్రెసా మోటార్స్‌ తన తొలి ఎలక్ట్రిక్‌ ట్రక్‌ ‘వీ0.1’ మోడల్‌ను ఆవిష్కరించింది. యాక్సియల్‌ ఫ్లక్స్‌ మోటార్‌ ప్లాట్‌ ఫామ్‌: ఫ్లక్స్‌350పై దీన్ని అభివృద్ధి చేసినట్టు సంస్థ ప్రకటించింది. దీన్ని ప్రపంచ మార్కెట్‌ కోసం డిజైన్‌ చేసినట్టు తెలిపింది. భవిష్యత్‌ కోసం ఉద్దేశించిన సుస్థిర రవాణా పరిష్కారాలను అందించాలన్న సంస్థ అంకిత భావానికి ఈ ఉత్పత్తి నిదర్శనంగా ఉంటుందని పేర్కొంది. ట్రెసా ఎలక్ట్రిక్‌ ట్రక్‌ ‘వీ0.1’లో 350 కిలోవాట్‌ పవర్‌ను అందించే మోటార్‌ ఉంటుంది. ఈ తరహా పవర్‌ను అందించే తొలి భారత ఓఈఎం తమదేనని ట్రెసా మోటార్స్‌ ప్రకటించింది.

యాక్సియల్‌ ఫ్లక్స్‌ మోటార్‌ను పూర్తి దేశీయంగా అభివృద్ధి చేసినట్టు తెలిపింది. ‘‘దేశంలో 28 లక్షల ట్రక్కులు ఉన్నాయి. ఇవి 60 శాతం కాలుష్యానికి కారణమవుతున్నాయి. కనుక మధ్య స్థాయి నుంచి, భారీ తరహా ట్రక్కులు సున్నా ఉద్గార ఇంధనాల వైపు మళ్లాల్సిన అవసరం ఉంది. 2024లో రానున్న వాహన తుక్కు విధానం, పెరుగుతున్న ఇంధన ధరలు ఎలక్ట్రిక్‌ ట్రక్కులకు అనుకూలించనున్నాయి. సురక్షిత, వినూత్న, పర్యావరణ పరిష్కారాలతో ఈ పరివర్తనాన్ని ట్రెసా ముందుండి నడిపిస్తుంది’’అని సంస్థ పేర్కొంది.

Videos

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)