Breaking News

‘సెలవులు పెడితే క్రిమినల్‌లా చూస్తున్నారు’.. సోషల్‌ మీడియా పోస్ట్‌ వైరల్‌!

Published on Sun, 08/13/2023 - 21:18

ప్రస్తుతం అన్ని రకాల ఉద్యోగాల్లోనూ పని ఒత్తిడి ఎక్కువైంది. ఇక ప్రైవేటు ఉద్యోగాల సంగతి చెప్పనక్కర్లేదు. పని వేళలకు, కుటుంబ జీవన సమయానికి సమతుల్యత అస్సలు ఉండటం లేదు. పని ఒత్తిడి సహజమే అయినప్పటికీ వర్క్‌ప్లేస్‌ వాతావరణం ప్రతికూలంగా ఉండటం, పై అధికారులు, తోటి ఉద్యోగుల సహకారం లేకుంటే ఆ ఒత్తిడి మరింత ఎక్కువౌతుంది.

ఈ రోజుల్లో చాలా మంది ఉద్యోగులు తమ వృత్తిపరమైన అనుభవాలను, వర్క్‌ప్లేస్‌లో  ఎదుర్కొంటున్న సవాళ్లను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ఇటీవల ఒక రెడిట్‌ (Reddit) యూజర్‌ తన వర్క్‌ప్లేస్‌లో ఎదురైన ప్రతికూల అనుభవాన్ని పంచుకున్నారు. ఎనిమిది నెలల తర్వాత మొదటిసారిగా సెలవులు (Vacation) తీసుకున్న తన పట్ల ఎంత ప్రతికూలంగా ప్రవర్తించారో వివరించారు. ఈ పోస్ట్‌ కాస్త

 

ఎనిమిది నెలల తర్వాత మొదటిసారిగా..
"నేను కంపెనీలో చేరినప్పటి నుంచి మొదటిసారి సెలవులు పెట్టాను. దీంతో నన్నో క్రిమినల్‌లా చూస్తున్నారు" అంటూ తన పోస్ట్‌ను మొదలు పెట్టారు. తాను ఉద్యోగంలో చేరిన ఎనిమిది నెలల తర్వాత మొదటిసారిగా ఒకటిన్నర వారం సెలవులు తీసుకున్నానని, కానీ సెలవు పెట్టిన రోజే తనకు పని చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. తన సహచరులు కూడా తనను ఏదో తప్పు చేసినట్టు చూశారని వాపోయారు.

సెలవులకు వెళ్లినప్పుడు తనతో ల్యాప్‌టాప్‌ కూడా తీసుకుని వెళ్లి రోజూ ఈమెయిల్స్‌ చెక్‌ చేయాలని చెప్పారని, కానీ తాను నిరాకరించినట్లు పేర్కొన్నారు. తాను ల్యాప్‌టాప్‌ తీసుకెళ్లినా రోజూ ఈమెయిల్స్‌ చెక్‌ చేయనని,  నాలుగైదు రోజులకోసారి చూస్తారని చెప్పినట్లు తెలిపారు. దీంతో సహచరులు తనపై కోపం ప్రదర్శిస్తూ సెలవులో ఉన్నప్పటికీ రోజూ ఈమెయిల్స్‌ చెక్‌ చేయాలని చెప్పినట్లు పేర్కొన్నారు.

ఈ పోస్టు కాస్త వైరల్‌గా మారింది. దీనిపై పలువురు యూజర్లు ప్రతిస్పందించారు. తమకూ ఇలాంటి అనుభవాలు ఎదురైనట్లు పేర్కొన్నారు. సెలవులపై వెళ్లినప్పుడు ల్యాప్‌టాప్ తీసుకువెళ్లకూడదంటూ సలహాలు ఇస్తూ కామెంట్లు పెట్టారు.

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)