Breaking News

ఇదిగో.. ఏఐని ఇలా వాడాలి.. ట్రాయ్‌ రూల్స్‌!

Published on Sat, 10/31/2026 - 17:15

న్యూఢిల్లీ: టెల్కోలు కృత్రిమ మేథ (ఏఐ)ని బాధ్యతాయుతంగా వినియోగించేలా చూసే దిశగా టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌ ముసాయిదా మార్గదర్శకాలను ప్రతిపాదించింది. వీటి ప్రకారం టెల్కోలు తమ బోర్డులు ఆమోదించిన ఏఐ పాలసీలను అమలు చేయాలి. అలాగే ప్రత్యేకంగా గవర్నెన్స్, సేఫ్టీ కమిటీలను ఏర్పాటు చేయాలి.

ఏఐకి సంబంధించిన తీవ్రమైన ఉదంతాలను సత్వరం నియంత్రణ సంస్థ దృష్టికి తీసుకెళ్లాలి. తమ తమ నెట్‌వర్క్‌లు, సర్వీసుల్లో ఏఐ సిస్టమ్‌లను వినియోగించడం వల్ల తలెత్తే పరిణామాలకు ఆయా టెల్కోలే బాధ్యత వహించాల్సి వస్తుంది. రిస్క్‌ల వర్గీకరణ, వినియోగ అనుమతులు, మానవ పర్యవేక్షణ, డేటా గవర్నెన్స్, వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారం తదితర అంశాలతో ఏఐ పాలసీని కంపెనీలు అంతర్గతంగా అమలు చేయాలి. దీనికి డైరెక్టర్ల బోర్డు ఆమోదముద్ర ఉండాలి.

ఏఐ సంబంధ ఉదంతాలను ప్రధానంగా అత్యంత తీవ్రమైనవి, తీవ్రమైనవి, ఒక మోస్తరుగా ఉన్నవి, అంత తీవ్రం కానివి అనే నాలుగు కేటగిరీల కింద వర్గీకరించాలి. తీవ్రమైన, అత్యంత తీవ్రమైన ఉదంతాలను నిర్దేశిత ఫార్మాట్‌లో, నిర్దిష్ట వ్యవధిలోగా ట్రాయ్‌కి తెలియజేయాలి. ఈ ముసాయిదా మార్గదర్శకాలపై సంబంధిత వర్గాలు నవంబర్‌ 27లోగా తమ అభిప్రాయాలను తెలియజేయాల్సి ఉంటుంది.

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)