Breaking News

తప్పనిసరి రీచార్జ్‌ ప్లాన్లను ప్రత్యేకంగా డిస్‌ప్లే చేయాలి

Published on Fri, 10/02/2026 - 02:50

న్యూఢిల్లీ: నిబంధనల ప్రకారం తప్పనిసరిగా అందించాల్సిన రీచార్జ్‌ ప్లాన్లు, స్పెషల్‌ టారిఫ్‌ వోచర్లను తమ వెబ్‌సైట్లు, మొబైల్‌ యాప్‌లలో ప్రత్యేకంగా కనిపించేలా కచ్చితంగా డిస్‌ప్లే చేయాలని టెల్కోలకు టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌ సూచించింది. ప్రస్తుతం టెల్కోలు వీటిని డిస్‌ప్లే చేస్తున్నప్పటికీ, పారదర్శకత పాటించడం లేదని, అంత సులువుగా కనిపించకుండా చేస్తున్నాయని వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ట్రాయ్‌ తాజా ఆదేశాలు ఇచ్చింది.

స్పష్టంగా కనిపించేలా ’ట్రాయ్‌ తప్పనిసరి చేసిన ప్యాక్‌లు’ అంటూ ప్రత్యేక ట్యాబ్‌ లేదా సెక్షన్‌ని రూపొందించి, అందులో వివిధ వోచర్లను పొందుపర్చాలని పేర్కొంది. వెబ్‌సైట్లు, మొబైల్‌ యాప్‌లలో ప్రీపెయిడ్‌ రీచార్జ్‌ సెక్షన్‌లో ఇది మొదటి సెక్షన్‌గా ఉండాలని తెలిపింది. అలాగే, ఇతరత్రా విక్రయ కేంద్రాల్లో సైతం వీటిని ప్రత్యేకంగా డిస్‌ప్లే చేయాలని పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల వారు, ఎక్కువగా చెల్లించే సామర్థ్యాలు లేని వారిని దృష్టిలో ఉంచుకుని డేటా కలపకుండా వాయిస్‌ కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం తక్కువ ధరతో, 30 రోజుల వరకు వేలిడిటీతో ప్రత్యేక టారిఫ్‌ వోచర్లను ప్రవేశపెట్టాలంటూ టెల్కోలను ట్రాయ్‌ ఇటీవలే ఆదేశించింది.

Videos

ఒళ్ళు దగ్గర పెట్టుకోండి..! బాబు, పవన్ కు రోజా స్ట్రాంగ్ వార్నింగ్

టైగర్ టైగర్ అని అరవకండయ్యా బాబు.. పవన్ కళ్యాణ్ కు తెలిస్తే బోను పంపించి..

ధురంధర్ హీరోతో కల్యాణి..

మహిళల 75 కిలోల బాక్సింగ్ లో లవ్లీనాకు స్వర్ణం

ఆ క్షణం నేను ఆలోచించింది ఇదే.. పైలెట్ స్మిట్‌ మచ్చార్‌ తో మోదీ వీడియో కాల్

నగరిలో చంద్రబాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేత

తన స్వార్ధం కోసం నన్ను ఇరికించాడు

బీసీ రిజర్వేషన్ల విషయంలో జగన్ ను ప్రశ్నిస్తే బాబుకే నష్టం..

కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్న వరుణ్ తేజ్ దంపతులు

10,000 అడుగుల ఎత్తులో మనుషులే లేని చోట రాతి గోడలు

Photos

+5

అందంతో ఆకట్టుకుంటున్న కయాదు.. ఫొటోలు వైరల్‌

+5

అదిరిపోయే లుక్స్‌తో రాశి ఖన్నా..(ఫొటోలు)

+5

సెప్టెంబర్ జ్ఞాపకాలు షేర్ చేసిన అనసూయ.. (ఫోటోలు)

+5

చుడీదార్‌లో బేబీ మూవీ ఫేమ్ వైష్ణవి చైతన్య.. (ఫోటోలు)

+5

కాంతారాకు ఏడాది.. హీరోయిన్‌ ఎమోషనల్‌ పోస్ట్ (ఫొటోలు)

+5

నడవలేని స్థితిలో సీనియర్ నటి శారద.. ఇలా మారిపోయిందేంటి? (ఫోటోలు)

+5

ఎల్లో కలర్ శారీలో విమలా రామన్ స్టన్నింగ్‌ లుక్స్‌.. (ఫొటోలు)

+5

చాన్నాళ్లకు కనిపించిన విజయ్‌ భార్య‌ సంగీత, కూతురు దివ్య (చిత్రాలు)

+5

తిరుపతి : వైభవంగా ప్రారంభమైన పోలేరమ్మ జాతర (ఫొటోలు)

+5

తెలంగాణ : నిర్మల్ లో సందడి చేసిన ప్రముఖ నటి శ్రీలీల (ఫొటోలు)