Breaking News

వొడాఫోన్ ఐడియాకు షాక్‌.. మూలిగే నక్కపై తాటికాయ అంటే ఇదే..

Published on Sat, 09/30/2023 - 19:39

మూలిగే నక్కపై తాటికాయ పడటం అంటే ఇదే.. రుణ భారంతో కొట్టుమిట్టాడుతున్న టెలికం సంస్థ వొడాఫోన్‌ ఐడియాకు భారీ జరిమానా రూపంలో ట్రాయ్‌ షాకిచ్చింది.  
ఇబ్బందికరమైన కాల్స్‌, SMSలను అరికట్టడంలో విఫలమైనందుకు టెలికాం రెగ్యులేటర్ ట్రాయ్ తమకు రూ. కోటి పెనాల్టీని విధించినట్లు వోడాఫోన్ ఐడియా కంపెనీ  తెలిపింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (Trai) సెప్టెంబర్ 28న జరిమానా విధించినట్లు వోడాఫోన్ ఐడియా (వీఐఎల్) తాజా రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.

టెలికాం కమర్షియల్ కమ్యూనికేషన్స్ కస్టమర్ ప్రిఫరెన్స్ రెగ్యులేషన్స్, 2018 ప్రకారం 2021 డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో ఫిర్యాదుల కోసం కంపెనీ నెట్‌వర్క్ ద్వారా పంపిన అన్‌సొలిసిటెడ్ కమర్షియల్ కమ్యూనికేషన్స్ (UCC)ని అరికట్టడంలో వొడాఫోన్‌ ఐడియా వైఫల్యం చెందినట్లు ట్రాయ్‌ పేర్కొంది. ఈ ఆర్డర్‌ని సమీక్షిస్తున్నామని, దీనిపై ఎలా ముందుకెళ్లాలన్న దానిపై పరిశీలిస్తున్నామని వొడాఫోన్‌ ఐడియా ఫైలింగ్‌లో తెలిపింది.

వొడాఫోన్‌ ఐడియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ఏప్రిల్‌–జూన్‌ (క్యూ1)లో నికర నష్టం మరింత పెరిగి రూ. 7,840 కోట్లను తాకింది. మరోవైపు జూన్‌ నెలలో 12.8 లక్షల మంది యూజర్లను ఈ టెలికాం కంపెనీ కోల్పోయింది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)