Breaking News

చిన్న సంస్థల రుణాల ట్రాకింగ్‌కు ప్రత్యేక సంస్థ ఉండాలి

Published on Sat, 01/11/2025 - 06:28

చిన్న వ్యాపార సంస్థలు తీసుకునే రుణాలు లేదా ఈక్విటీ కింద సమీకరించే సద్వినియోగం అవుతున్నాయో లేదో పరిశీలించేందుకు మార్కెట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సంస్థలాంటిదేదైనా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) చైర్మన్‌ సీఎస్‌ శెట్టి అభిప్రాయపడ్డారు. 

‘నిధులను దేని కోసం తీసుకుంటున్నారో కచి్చతంగా ఆ అవసరానికే వినియోగించేలా చూసేందుకు ఒక యంత్రాంగం అవసరం. రుణంగా లేదా ఈక్విటీ కింద తీసుకున్న నిధుల వినియోగాన్ని ట్రాక్‌ చేసే అధికారాలతో ప్రత్యేక మార్కెట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సంస్థలాంటిది ఉండాలి‘ అని ఎన్‌ఐఎస్‌ఎం నిర్వహించిన సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. ఇలాంటి సంస్థను ఏర్పాటు చేయడం వల్ల రుణదాతలు, ఇన్వెస్టర్లకు కొంత భరోసా లభించగలదని శెట్టి చెప్పారు.

 చిన్న వ్యాపార సంస్థలు సమీకరించిన నిధులను అంతిమంగా ఉపయోగించే తీరుతెన్నులపై ఆందోళన వ్యక్తమవుతుండటం, నిధుల వినియోగాన్ని పర్యవేక్షించాలంటూ బ్యాంకులపై ఆర్‌బీఐ కూడా ఒత్తిడి పెంచుతుండటం తదితర పరిణామాల నేపథ్యంలో శెట్టి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 

మరోవైపు, 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ ఎదగాలంటే దేశీయంగా పొదుపు రేటు మరింత పెరగాలని, ఇందులో క్యాపిటల్‌ మార్కెట్లు కూడా కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని శెట్టి చెప్పారు. క్రెడిట్‌ రేటింగ్స్‌ను పొందాలంటే చిన్న, మధ్య తరహా సంస్థలకు సరైన ఆర్థిక వివరాల రికార్డులు గానీ ఆర్థిక వనరులు గానీ ఉండవని, అలాంటి సంస్థలకు రుణాలివ్వడంలో రిస్కులను మదింపు చేయడం బ్యాంకులకు కష్టతరంగా ఉంటుందని పేర్కొన్నారు.  
 

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)