Breaking News

వ్యాపార ఆశావాదం జూమ్‌

Published on Sat, 07/08/2023 - 06:32

హైదారాబాద్‌: వ్యాపార ఆశావాదం మెరుగుపడినట్టు టీఆర్‌ఏ మార్కెటింగ్‌ డెసిషన్‌ ఇండెక్స్‌ ప్రకటించింది. 2023 మూడో త్రైమాసికం (జూలై–సెప్టెంబర్‌) విషయంలో వ్యాపార ఆశావహం ఎంతో ఎక్కువగా ఉంటుందని తాజా నివేదికలో వెల్లడించింది. వరుసగా మూడో త్రైమాసికంలోనూ అధిక సానుకూలత వ్యక్తమైనట్టు తెలిపింది. టీఆర్‌ఏ మార్కెటింగ్‌ డెసిషన్‌ ఇండెక్స్‌ (ఎండీఐ) 2023 క్యూ2లో 89.37గా ఉంటే క్యూ3 అంచనాలు 92.68 పాయింట్లకు చేరింది. 50కిపైన సానుకూలంగా, 50కి దిగువ ప్రతికూలంగా పరిగణిస్తుంటారు. ఈ ప్రకారం మూడో త్రైమాసికానికి వ్యాపార ఆశావహం ఎంతో మెరుగ్గా ఉంటుందని ఎండీఐ తెలిపింది.

నివేదికలోని అంశాలు..  
► కంపెనీలకు సంబంధించి మార్కెటింగ్‌ బడ్జెట్‌ గణనీయంగా పెరగొచ్చు. ఇందుకు సంబంధించి సూచీ 8.8 శాతం పెరిగి 85.1 నుంచి 92.6 పాయింట్లకు క్యూ3లో చేరుకోవచ్చు.
► ప్రాంతీయ ప్రింట్‌ ప్రకటనల వాటా మార్కెటింగ్‌ బడ్జెట్‌లో అధికంగా ఉంటుంది. అవుట్‌ ఆఫ్‌ హోమ్‌ అడ్వర్టైజింగ్‌ (ఓఓహెచ్‌) వాటా 11 శాతం, జాతీయ టీవీల ప్రకటనలు, రేడియో ప్రకటనలు చెరో 10 శాతం వాటా ఆక్రమించనున్నాయి.  
► లోకల్‌ టీవీ ప్రకటనలు, ఇంగ్లిష్‌ ప్రింట్‌ ప్రకటనల వాటా 9 శాతం, సోషల్‌ మీడియా ప్రకటనల వాటా 7 శాతం మేర ఉండనుంది. డిజిటల్‌ సెర్చ్, డిజిటల్‌ యాడ్‌ 6 శాతం ఉండొచ్చని ఎండీఐ నివేదిక అంచనా వేసింది. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)