Breaking News

ఇన్నోవా క్రిస్టాకు కౌంట్‌డౌన్!.. నిలిపివేతా?

Published on Sun, 01/04/2026 - 16:03

భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఇన్నోవా క్రిస్టా కారును టయోటా కంపెనీ నిలిపివేయడానికి సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. సంస్థ దీనిని 2027 నాటికి దశలవారీగా తొలగించనున్నట్లు కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

టయోటా కంపెనీ 2025లో మొదటిసారిగా.. తన ఇన్నోవా క్రిస్టా కారును దశలవారీగా తొలగించాలని ప్రణాళిక వేసింది, కానీ హైక్రాస్ ప్రవేశపెట్టిన తర్వాత.. కూడా క్రిస్టా ఉత్పత్తిని విస్తరించాలని నిర్ణయించుకుంది. అయితే కఠినమైన ఉద్గార నిబంధనలు కారణంగా.. దీనిని నిలిపివేసేందుకు ఇప్పుడు సంస్థ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

కఠినమైన CAFE (కార్పొరేట్ యావరేజ్ ఫ్యూయెల్ ఎఫిషియన్సీ) నిబంధనల ప్రకారం.. కంపెనీ హైబ్రిడ్ మోడళ్లను లాంచ్ చేయడానికి ఆసక్తి చూపుతోంది. ఇదే జరిగితే.. చాలాకాలంగా ఆటోమొబైల్ మార్కెట్లో తన హవా కొనసాగించిన కారు కనిపించకుండా పోయే అవకాశం ఉంది. అంటే భవిష్యత్తులో కొత్త క్రిస్టా కారును కొనుగోలు చేయలేమని తెలుస్తోంది.

ప్రస్తుతం ఇన్నోవా క్రిస్టా 2.4 లీటర్ డీజిల్ ఇంజిన్‌తో మాత్రమే విక్రయిస్తోంది. ఇది 148 BHP & 343 Nm టార్క్ అందిస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ కలిగి మంచి పనితీరును అందిస్తుంది. ఇప్పటికే చాలా కంపెనీలు డీజిల్ కార్ల విక్రయాలను తగ్గిస్తున్నాయి. ఇది కూడా టయోటా కంపెనీ తన క్రిస్టా కారును నిలిపివేయడానికి ఒక కారణం అని తెలుస్తోంది.

Videos

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు