Breaking News

అదానీ గ్రీన్‌లో టోటల్‌ ఎనర్జీ

Published on Thu, 09/21/2023 - 05:32

న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్‌ దిగ్గజం అదానీ గ్రూప్‌తో ఏర్పాటు చేయనున్న శుద్ధ ఇంధన భాగస్వామ్య కంపెనీ(జేవీ)లో 30 కోట్ల డాలర్లు(రూ. 2,500 కోట్లు) ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు ఫ్రెంచ్‌ దిగ్గజం టోటల్‌ఎనర్జీస్‌ తాజాగా వెల్లడించింది. కొత్తగా నెలకొల్పనున్న జేవీలో 50 శాతం వాటాను సొంతం చేసుకోనున్నట్లు తెలియజేసింది. మిగిలిన 50 శాతం వాటాను అదానీ గ్రీన్‌ ఎనర్జీ పొందనుంది. ఈ జేవీ మొత్తం 1,050 మెగావాట్ల పోర్ట్‌ఫోలియోను కలిగి ఉండనుంది. వీటిలో 300 మెగావాట్ల సామర్థ్యం ఇప్పటికే ప్రారంభంకాగా.. 500 మె.వా నిర్మాణంలో ఉంది.

మరో 250 మె.వా సోలార్, విండ్‌ కలయికతో అభివృద్ధి దశలో ఉంది. కాగా.. యూఎస్‌ షార్ట్‌సెల్లర్‌ హిండెన్‌బర్గ్‌ ఆరోపణల తదుపరి గౌతమ్‌ అదానీ గ్రూప్‌ కంపెనీతో ఫ్రెంచ్‌ దిగ్గజం టోటల్‌ తొలిసారి పబ్లిక్‌ డీల్‌ను కుదుర్చుకోవడం గమనార్హం! శుద్ధ ఇంధన ప్రాజెక్టుల పోర్ట్‌ఫోలియో విస్తరణలో భాగంగా టోటల్‌ తాజా పెట్టుబడులను చేపట్టింది. ఇప్పటికే అదానీ గ్రీన్‌ ఎనర్జీలో 19.7 శాతం వాటాను కలిగిన టోటల్‌.. 2,353 మె.వా. పోర్ట్‌ఫోలియోగల ఏజీఈ23ఎల్‌(జేవీ)లో అదానీ గ్రీన్‌తో సమాన వాటాను కలిగి ఉంది. ఇక 2019లోనే అదానీ టోటల్‌ గ్యాస్‌లో 37.4 శాతం వాటాను టోటల్‌ పొందింది. ఇందుకు 30 కోట్ల డాలర్లు(రూ. 2,500 కోట్లు) ఇన్వెస్ట్‌ చేసింది.

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)