Breaking News

కోడింగ్‌ పోరులో కంపెనీలు.. 

Published on Sun, 06/22/2025 - 05:51

సాంకేతికత పెరిగే కొద్దీ కృత్రిమ మేథ (ఏఐ) రంగంలో కొత్త రకం యుద్ధాలు మొదలవుతున్నాయి. పైథాన్, రస్ట్‌లాంటి ప్రోగ్రామింగ్‌ ల్యాంగ్వేజ్‌లతో సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌లో వాటాల కోసం అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజాలు, అంకుర సంస్థలు ఒకదానితో మరొకటి పోటీపడుతూ కత్తులు దూసుకుంటున్నాయి. ఏఐ టెక్‌ దిగ్గజాలు ఇటీవలే పోటాపోటీగా కొత్త సాధనాలను ఆవిష్కరించాయి. గూగుల్‌ తమ గోడింగ్‌ ఏజెంట్‌ జ్యూల్స్‌ను, మైక్రోసాఫ్ట్‌ గిట్‌హబ్‌ ఏఐ ఏజెంటును, కోడింగ్‌ స్టార్టప్‌ విండ్‌సర్‌్ఫను 3 బిలియన్‌ డాలర్లతో కొన్న ఊపులో ఓపెన్‌ఏఐ సంస్థ కోడెక్స్‌ను ప్రవేశపెట్టాయి.

 వీటన్నింటి లక్ష్యం ఏమిటంటే, కోడింగ్‌ రాయడంలో డెవలపర్లకు సహాయం చేయడం, బగ్‌లను ఫిక్స్‌ చేయడం, అలాగే కర్సర్, లవబుల్, బోల్ట్‌లాంటి స్టార్టప్‌లతో నేరుగా పోటీపడటం. డెవలపర్లు, అంకుర సంస్థలు ఈ పరిణామాలపై పెద్దగా ఆశ్చర్యపోవడం లేదు. జెన్‌ఏఐ రేసుతో ముందుగా ప్రభావం పడేది సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ విభాగమేనని పరిశీలకులు చెబుతున్నారు. కంపెనీలు ఇప్పటికే సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ కోసం కోడింగ్‌ టూల్స్‌ను విరివిగా ఉపయోగిస్తుండటం ఇందుకు నిదర్శనమంటున్నారు.  

టూల్స్‌ వాడకం ఒక్కటే ఆప్షన్‌..  
ఏఐ టూల్స్‌ను ఉపయోగించడాన్ని నేర్చుకోవడం తప్ప ప్రస్తుతం వేరే ఆప్షన్‌ లేదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్‌ కంపెనీల్లో ఇప్పటికే కోడింగ్‌ 30 శాతం ఏఐ ద్వారానే జరుగుతోంది. అటు ఇన్‌మొబీ సంస్థ కోడింగ్‌లో దాదాపు 50 శాతం ఏఐతోనే జరుగుతోంది. దీన్ని 80 శాతానికి పెంచుకునే ప్రయత్నాల్లో కంపెనీ ఉంది. 

మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ ప్లాట్‌ఫాం మార్కెట్స్‌అండ్‌మార్కెట్స్‌ గణాంకాల ప్రకారం ఏఐ కోడింగ్‌ టూల్‌ మార్కెట్‌ ఏటా 28 శాతం వృద్ధి చెందుతూ 2028 నాటికి 12.6 బిలియన్‌ డాలర్లకు చేరుతుందనే అంచనాలు ఉన్నాయి. ఉత్పాదకత పెరగడంపరంగా ఉద్యోగులకు ఉపయోగకరంగా ఉండటం, మార్కెటింగ్‌ .. సేల్స్‌లాంటి నాన్‌–టెక్నికల్‌ టీమ్‌లు కూడా ఉపయోగించడానికి సులువుగా ఉండటం వంటి అంశాల కారణంగా కోడింగ్‌ టూల్స్‌ వినియోగం పెరుగుతోంది. దీంతో ఈ విభాగంపై భారీగా ఇన్వెస్ట్‌ చేసిన టెక్‌ దిగ్గజాలకు ఆదాయార్జనకు ఇదొక కొత్త మార్గంగా నిలుస్తోంది. 

కొత్త ఆదాయ మార్గం.. 
ఫౌండేషనల్‌ మోడల్స్‌పై కోట్ల కొద్దీ డాలర్లు కుమ్మరించిన కంపెనీలు ఇప్పుడు వాటిపై రాబడులు అందుకోవడంపై మరింతగా దృష్టి పెడుతున్నాయని ఎల్‌ఎల్‌ఎం ఎవాల్యుయేషన్‌ ప్లాట్‌ఫాం అయిన నోవియం వర్గాలు తెలిపాయి. ఎల్‌ఎల్‌ఎంలకు కోడ్‌ జనరేట్‌ చేయడమనేది ప్రధాన ఆదాయ వనరుగా ఉంటోందని వివరించాయి. కర్సర్‌ అనే సంస్థ గత రెండేళ్లుగా ఏటా 300 మిలియన్‌ డాలర్ల  మేర ఆదాయాలను ఆర్జిస్తోందని పేర్కొన్నాయి. ఇక బోల్ట్, లవబుల్‌లాంటి సంస్థలు కూడా ఊహించని స్థాయిలో ఆదాయాలు ఆర్జిస్తున్నాయి. 

తమ ఇంజినీర్ల ఉత్పాదకత కనీసం 10–20 శాతమైన పెరుగుతుందంటే ఈ టూల్స్‌పై ఇన్వెస్ట్‌ చేసేందుకు కంపెనీలు ముందుకొస్తున్నాయి. ప్రస్తుతం కోడింగ్‌ ఆటోమేషన్‌ అనేది ప్రస్తుతం హాట్‌ సెక్టార్‌గా మారిందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. టెక్నికల్‌యేతర నేపథ్యాలున్న వారు కూడా సులభంగా, సరళంగా వెబ్‌సైట్‌లు, చాట్‌బాట్లను రూపొందించడానికి ఇది ఉపయోగపడుతోందని వివరించాయి. సాధారణంగా పెద్ద కంపెనీల్లో ఏఐ టూల్స్‌ను మిగతా అవసరాల కోసం పెద్దగా ఉపయోగించకపోయినా ఉత్పాదకతను పెంచుకునేందుకు ఉపయోగించుకుంటున్నాయి.

సవాళ్లూ ఉన్నాయి.. 
కోడింగ్‌ పని 70 శాతం వేగవంతమవడానికి ఏఐ టూల్స్‌ ఉపయోగపడుతున్నాయి. కోడింగ్‌ చేయడానికి టూల్స్‌ ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నప్పటికీ, వీటితో సవాళ్లు కూడా ఉన్నాయని నిపుణులు తెలిపారు.  పని వేగవంతమవుతోంది కాబట్టి ఏఐని ఉపయోగించి ప్రతి ఒక్కరూ కోడింగ్‌ చేసేయొచ్చనే అపోహలు ఉంటున్నాయని పేర్కొన్నారు. 70 శాతం పూర్తయితే సరిపోదు, దాన్ని 100 శాతం వరకు తీసుకెళ్లేందుకు నిపుణుల అవసరం అవుతుందని వివరించారు. 

అంతేగాదు, కోడింగ్‌ టూల్స్‌ వినియోగం పెరిగే కొద్దీ రివ్యూ చేయాల్సిన కోడ్స్‌ సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోందని పేర్కొన్నారు. తమ కస్టమర్లపై ప్రభావం పడకుండా రివ్యూ ప్రక్రియలను కూడా కంపెనీలు ఆటోమేట్‌ చేస్తున్నాయి. తాము ఏకకాలంలో వివిధ సిస్టమ్‌లను అభివృద్ధి చేస్తూనే, వాటి అమలు తీరుతెన్నులను కూడా పర్యవేక్షించే ప్రయత్నాల్లో ఉన్నామని ఇన్‌మొబి వర్గాలు తెలిపాయి. ఎప్పటికప్పుడు తప్పొప్పులను పరీక్షించుకుంటూ ముందుకెళ్తుండటం వల్ల తమ దగ్గర కోడింగ్‌లో ఏఐ వినియోగం ప్రస్తుతానికి యాభై శాతం స్థాయిలోనే ఉందని వివరించాయి.  
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)