Breaking News

ఐటీ పరిశ్రమలో కొత్త చిగురులు.. చాన్నాళ్లకు మారిన పరిస్థితులు

Published on Sun, 10/20/2024 - 20:39

దేశంలోని ఐటీ పరిశ్రమలో సన్నగిల్లిన నియామకాలకు మళ్లీ కొత్త చిగురులు వచ్చాయి. దాదాపు ఏడు త్రైమాసికాల తర్వాత భారతీయ ఐటీ పరిశ్రమలో క్షీణిస్తున్న హెడ్‌కౌంట్ ట్రెండ్‌ మారింది. టాప్ ఆరు ఐటీ కంపెనీలలో ఐదు కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య పెరిగింది.

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా, ఎల్‌టీఐమైండ్‌ట్రీ సంస్థలు సెప్టెంబర్ త్రైమాసికంలో మొత్తంగా 17,500 మందికి పైగా ఉద్యోగులను నియమించుకున్నాయి. ఒక్క హెచ్‌సీఎల్‌ టెక్‌లో మాత్రమే పరిస్థితి మారలేదు. గత త్రైమాసికంలో ఈ ‍కంపెనీలో ఉద్యోగుల సంఖ్య 780 తగ్గింది.

దేశంలో ఐదవ అతిపెద్ద ఐటీ కంపెనీ అయిన టెక్ మహీంద్రా అత్యధికంగా సెప్టెంబర్ త్రైమాసికంలో 6,653 మంది ఉద్యోగులను చేర్చుకుని తాజా నియామకాలకు నాయకత్వం వహించింది. దీని తర్వాత దేశంలో అతిపెద్ద ఐటీ సంస్థ అయిన టీసీఎస్‌ తన 600,000 మంది ఉద్యోగులకు 5,726 మంది ఉద్యోగులను జోడించింది.

ఇదీ చదవండి: ఇలా కూడా రిజెక్ట్‌ చేస్తారా? గూగుల్‌ టెకీ వింత అనుభవం

రెండవ, నాల్గవ అతిపెద్ద ఐటీ సంస్థలైన ఇన్ఫోసిస్, విప్రో ఈ త్రైమాసికంలో వరుసగా 2,456, 978 మంది ఉద్యోగులను చేర్చుకున్నాయి. ఇన్ఫోసిస్ వరుసగా ఆరు త్రైమాసికాల తర్వాత తన వర్క్‌ఫోర్స్‌ను విస్తరించింది. పెండింగ్‌లో ఉన్న కాలేజీ రిక్రూట్‌లను కూడా ఆన్‌బోర్డింగ్ చేస్తామని ఇరు కంపెనీలు ఇప్పటికే ప్రకటించాయి.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)