Breaking News

2026 జనవరిలో లాంచ్ అయ్యే కార్లు: వివరాలు

Published on Tue, 12/30/2025 - 18:53

2026 జనవరిలో చాలా కంపెనీలు తమ ఉత్పత్తులను లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతున్నాయి. ఇందులో కియా, మారుతి సుజుకి, మహీంద్రా, రెనాల్ట్, స్కోడా కంపెనీలు ఉన్నాయి. వీటికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

కియా సెల్టోస్
సెకండ్ జనరేషన్ సెల్టోస్ కారును.. కియా కంపెనీ జనవరి 2న లాంచ్ చేయనుంది. అంటే.. ఇప్పటికే ఆవిష్కరించబడిన ఈ కారు ధరలను ఆరోజు అధికారికంగా వెల్లడిస్తారన్నమాట. ఈ కారు 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.5 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఎంపికలతో లభించనుంది. ఇది అప్డేటెడ్ డిజైన్, ఫీచర్స్ పొందుతుంది.

మారుతి సుజుకి ఈ విటారా
మారుతి సుజుకి ఈ విటారాతో.. మిడ్ సైజ్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ రంగంలోకి అడుగుపెట్టనుంది. ఇది 49 kWh & 61 kWh బ్యాటరీ ప్యాక్స్ పొందే అవకాశం ఉంది. రేంజ్ విషయం లాంచ్ తరువాత తెలుస్తుంది. కానీ ఇది 428 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. ఇది హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, టాటా కర్వ్ EV, మహీంద్రా BE 6 వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. ధరలు లాంచ్ సమయంలోనే వెల్లడవుతాయి.

మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ 
మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ జనవరి 5న లాంచ్ అవుతుంది. ఇది XUV700కు రీబ్రాండెడ్ వెర్షన్. ఇది రిఫ్రెష్డ్ స్టైలింగ్ & ఇంటీరియర్ అప్‌డేట్‌లతో ప్రీమియం లుక్ పొందుతుంది. అయితే యాంత్రికంగా, పెద్దగా మార్పులు ఏమీ ఉండవని సమాచారం. మూడు వరుసల SUV కోసం చూస్తున్న కొనుగోలుదారులను లక్ష్యంగా చేసుకుని కంపెనీ ఈ కారును లాంచ్ చేయనుంది.

ఇదీ చదవండి: కేంద్రమంత్రి చెంతకు.. మేడ్ ఇన్ ఇండియా కారు

రెనాల్ట్ డస్టర్
న్యూ జనరేషన్ రెనాల్ట్ డస్టర్.. జనవరిలో లాంచ్ అయ్యే కార్ల జాబితాలో ఒకటి. CMF-B ప్లాట్‌ఫామ్ ఆధారంగా, కొత్త డిజైన్ పొందుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన టీజర్ వీడియోలను కూడా కంపెనీ వెల్లడించింది. ఇది టర్బో పెట్రోల్ ఇంజిన్ ఎంపికలతో వస్తుందని సమాచారం.

స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్
అత్యధిక ప్రజాదరణ పొందిన స్కోడా కుషాక్.. జనవరి ప్రారంభంలో ఫేస్‌లిఫ్ట్ రూపంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇది మెకానికల్ మార్పుల కంటే కాస్మెటిక్ ట్వీక్‌లు, అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుంది. కాబట్టి ఇంజిన్ విషయంలో ఎలాంటి మార్పు లేదని స్పష్టమవుతోంది.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)