లాంచ్‌కు సిద్దమవుతున్న కొత్త ఎలక్ట్రిక్ కార్లు ఇవే..

Published on Fri, 05/23/2025 - 16:23

ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ అంతకంతకూ పెరుగుతున్న సమయంలో చాలా కంపెనీలు సరికొత్త EVలను లాంచ్ చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఈ ఏడాది ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త ఎలక్ట్రిక్ కార్లు ఏవి అనే విషయం ఇక్కడ తెలుసుకుందాం.

టాటా హారియర్ ఈవీ
ఎలక్ట్రిక్ వాహన విభాగంలో అగ్రగామిగా సాగుతున్న.. టాటా మోటార్స్ జూన్ 3న హారియర్ ఈవీ లాంచ్ చేయనుంది. ఇది 500 కిమీ రేంజ్ అందించే బ్యాటరీ ప్యాక్ పొందుతుందని సమాచారం. కంపెనీకి చెందిన ఇతర కార్ల మాదిరిగానే ఇది కూడా మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుందని తెలుస్తోంది. ధర, బుకింగ్స్ వంటి వివరాలు తెలియాల్సి ఉంది.

కియా క్లావిస్ ఈవీ
కియా మోటారు తన క్లావిస్ కారును ఈ రోజు (మే 23) రూ.11.49 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. అయితే దీనిని ఎలక్ట్రిక్ రూపంలో లాంచ్ చేయడానికి ఇంకా కొంచెం సమయం తీసుకుంటుందని తెలుస్తోంది. ఈ కారు ఒక సింగిల్ ఛార్జితో 400 నుంచి 500 కిమీ రేంజ్ అందిస్తుందని తెలుస్తోంది.

ఇదీ చదవండి: 24 గంటల్లో 1618 కిమీ ప్రయాణించిన స్కూటర్

మహీంద్రా XUV 3ఎక్స్ఓ ఈవీ
ఈ ఏడాది ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేయనున్న కంపెనీల జాబితాలో మహీంద్రా అండ్ మహీంద్రా కూడా ఉంది. ఈ కంపెనీ XUV 3ఎక్స్ఓ ఈవీని లాంచ్ చేయనుంది. దీనికి సంబంధించిన వివరాలు చాలా వరకు అధికారికంగా వెల్లడి కానప్పటికీ.. ఇది 456 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం.

మారుతి ఈ విటారా
మారుతి సుజుకి కూడా ఈ ఏడాది తన మొట్టమొదటి.. ఎలక్ట్రిక్ కారు ఈ విటారా లాంచ్ చేయనుంది. ఇప్పటికే ఈ కారు జనవరిలో జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో కనిపించింది. ఇది సెప్టెంబర్ 2025 నాటికి మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇందులో 48.8 కిలోవాట్ బ్యాటరీ, 61.1 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ అనే రెండు ఆప్షన్స్ ఉండనున్నాయి.

Videos

ప్రైవేట్ కే మెడికల్ కాలేజీలను కట్టబెట్టాలని నిర్ణయం

క్రైస్తవ సోదరులకు జగన్ క్రిస్మస్ శుభాకాంక్షలు

అడ్డంగా ఇరుక్కున్నారుగా!! పచ్చ బొట్టు సాక్షిగా బయటపడ్డ పచ్చి నిజం

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 17 మంది సజీవ దహనం

YSRCP కాదు.. పక్కా జనసేన.. వాడికి పవన్ అంటే పిచ్చి.. అజయ్ దేవ్ చెల్లి షాకింగ్ నిజాలు

ఎవరికీ భయపడను! శివాజీ మరో సంచలన వీడియో

హిప్పో జర తప్పుకో, ఈ సెక్యూరిటీ ధైర్యానికి సలాం!

ఆంధ్రా కిమ్ నారా లోకేష్

పవన్ పీకింది చాలు! డిప్యూటీ సీఎంవా.. ఆకు రౌడీవా!

మార్కెట్లోకి Ai వాషింగ్ మిషన్లు

Photos

+5

హీరోయిన్ తమన్నా ఇంట్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

శరత్ కుమార్-రాధిక క్రిస్మస్ లంచ్‌లో కోలీవుడ్ స్టార్స్ (ఫొటోలు)

+5

హృతిక్ రోషన్ కజిన్ పెళ్లి.. సెలబ్రిటీల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో క్రిస్మస్‌ పండగ సందడి (ఫొటోలు)

+5

వారణాసి ట్రిప్‌లో అలనాటి హీరోయిన్ భాగ్యశ్రీ (ఫొటోలు)

+5

బ్లాక్‌ డ్రెస్‌లో ఫుల్ గ్లామరస్‌గా అక్కినేని కోడలు శోభిత (ఫొటోలు)

+5

భర్తతో కలిసి తిరుమల శ్రీవారి సేవలో పీవీ సింధు (ఫొటోలు)

+5

#INDvsSL : విశాఖలో విశ్వవిజేతల దండయాత్ర (ఫొటోలు)

+5

మహేష్‌ బాబు ఫ్యామిలీలో వేడుక.. ఫోటోలు వైరల్‌

+5

అదరగొట్టిన విల్లా మేరీ కాలేజ్ విద్యార్థినులు (ఫొటోలు)