Breaking News

2023లో భారత్‌లో అడుగుపెట్టిన టాప్ ఎలక్ట్రిక్ కార్లు.. ఇవే!

Published on Thu, 12/21/2023 - 21:03

రోజు రోజుకి ఎలక్ట్రిక్ కార్ల వినియోగం పెరుగుతున్న సమయంలో వాహన తయారీ సంస్థలు కూడా ఈవీలనే లాంచ్ చేయడానికి సుముఖత చూపుతున్నాయి. 2023లో దేశీయ విఫణిలో అడుగుపెట్టిన టాప్ 5 బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

లోటస్ ఎలెట్రా (Lotus Eletre)
ఈ ఏడాది ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ కారు  'లోటస్ ఎలెట్రా'. నవంబర్ 2023న అధికారికంగా లాంచ్ అయిన ఈ కారు ధర రూ.2.55 కోట్ల నుంచి రూ.2.99 కోట్లు. ఈ కారు కేవలం 2.95 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని గరిష్ట వేగం గంటకు 265కిమీ. సింగిల్ చార్జితో 600 కిమీ ప్రయాణించే ఈ కారు రెండు పవర్ ట్రెయిన్ ఆప్షన్లతో లభిస్తుంది.

హ్యుందాయ్ ఐయోనిక్ 5 (Hyundai Ioniq 5)
హ్యుందాయ్ కంపెనీకి చెందిన ఐయోనిక్ 5 దేశీయ మార్కెట్లో 2022లో అడుగు పెట్టినప్పటికీ 2023లో అధికారిక ధరలు వెల్లడయ్యాయి. 2023లో భారతీయ విఫణిలో అడుగుపెట్టిన మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు ఇదే కావడం గమనార్హం. దీని ధర రూ. 44.95 లక్షలు (ఎక్స్ షోరూమ్). సింగిల్ చార్జితో 600 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందించే ఈ కారు డిజైన్ పరంగా చాలా కొత్తగా ఉంటుంది.

2023 టాటా నెక్సాన్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ (2023 Tata Nexon EV Facelift)
దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ ఈ ఏడాది టాటా నెక్సాన్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ లాంచ్ చేసింది. పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ వెర్షన్లలో లభించే ఈ కారు ప్రారంభం నుంచి ఇండియన్ మార్కెట్లో అత్యుత్తమ అమ్మకాలు పొందుతూ దూసుకెళ్తోంది. సింగిల్ చార్జితో 325 కిమీ రేంజ్ అందించే ఈ కారు ప్రారంభ ధర రూ. 14.74 లక్షలు.

ఎంజీ కామెట్ (MG Comet)
ఇండియన్ మార్కెట్లో సరసమైన ధరకు లభించే ఎంజి ఈవీ కామెట్ ఏప్రిల్ 2023లో లాంచ్ అయింది. రూ. 7.89 లక్షల వద్ద లభించే ఈ కారు సింగిల్ చార్జితో 230కిమీ రేంజ్ అందిస్తుందని కంపెనీ ధ్రువీకరించింది. చూడటానికి చిన్నగా ఉన్నప్పటికీ మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన ఈ కారు టాటా టియాగో ఈవీ, సిట్రోయిన్ ఈసీ3 వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.

సిట్రోయిన్ ఈసీ3 (Citroen EC3)
'సిట్రోయెన్ సీ3'తో భారతదేశంలో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఫ్రెంచ్ వాహన తయారీ సంస్థ సిట్రోయెన్.. ఈ ఏడాది రూ. 11.50 లక్షల (ఎక్స్ షోరూమ్) ధర వద్ద ఈసీ3 విడుదల లాంచ్ చేసింది. సింగిల్ చార్జితో 320కిమనీ రేంజ్ అందించే ఈ ఎలక్ట్రిక్ కారు ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచేలా తయారైంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)