Breaking News

ప్రపంచంలో పే..ద్ద బ్యాంకులు ఇవే..

Published on Sat, 05/03/2025 - 14:13

ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మూలం బ్యాంకులే. ఆర్థికపరమైన పరిణామాలన్నీ బ్యాంకుల ద్వారానే జరుగుతాయి. అప్పు కావాలన్నా.. సంపాదించిన సొమ్ము దాచుకోవాలన్నా అన్నింటికీ బ్యాంకులే ఆధారం. ట్రిలియన్ డాలర్ల విలువైన ఆస్తులను నిర్వహించే సంస్థలతో ప్రపంచ బ్యాంకింగ్ పరిశ్రమ ఆధిపత్య ఉనికిని కొనసాగిస్తోంది. స్టాటిస్టా నివేదిక ప్రకారం 2025 నాటికి ఈ రంగం నికర వడ్డీ ఆదాయం 8.94 ట్రిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా.

మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా అమెరికాకు చెందిన జేపీ మోర్గాన్ ఛేజ్ ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంకు. మొత్తం ఆస్తుల పరంగా ఇది అమెరికాలో అతిపెద్ద బ్యాంకు. ఈ ర్యాంకింగ్స్ లో అమెరికన్ బ్యాంకులు ఆధిపత్యం కొనసాగిస్తుండగా, చైనా బ్యాంకులు టాప్ టెన్ లో నాలుగింటిని ఆక్రమించాయి. ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా (ఐసీబీసీ) ఆసియాలోనే అతిపెద్దదిగా అవతరించింది.

టాప్‌ 10లో భారతీయ బ్యాంకు
మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా టాప్‌ 10 బ్యాంకులలో ఓ భారతీయ బ్యాంకు కూడా చోటు దక్కించుకుంది. హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌తో  విలీనం తరువాత భారత్‌కు చెందిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ భారతదేశంలో అతిపెద్ద బ్యాంకుగా, ప్రపంచవ్యాప్తంగా పదో అతిపెద్ద బ్యాంకుగా మారింది.  2025 మే 2 నాటికి ఇది 184.44 బిలియన్ డాలర్లు (రూ.1,553,706 కోట్లు) మార్కెట్ క్యాప్‌ కలిగి ఉంది.

టాప్‌ 10 అతిపెద్ద బ్యాంకులు.. వాటి మార్కెట్‌ క్యాప్‌
1.    జెపి మోర్గాన్ ఛేజ్    రూ.57,80,495 కోట్లు
2.    ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా (ఐసీబీసీ)    రూ.2,696,421  కోట్లు 
3.    బ్యాంక్ ఆఫ్ అమెరికా    రూ.2,549,084  కోట్లు
4.    అగ్రికల్చరల్ బ్యాంక్ ఆఫ్ చైనా    రూ.2,163,540  కోట్లు
5.    వెల్స్ ఫార్గో    రూ.1,968,702  కోట్లు
6.    చైనా కన్స్ట్రక్షన్ బ్యాంక్ (సీసీబీ)    రూ.1,824,265  కోట్లు
7.    బ్యాంక్ ఆఫ్ చైనా    రూ.1,745,070  కోట్లు
8.    హెచ్.ఎస్.బి.సి.    రూ.1,660,165  కోట్లు
9.    మోర్గాన్ స్టాన్లీ    రూ.1,580,581  కోట్లు
10.   హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్    రూ.1,553,706 కోట్లు

Source: companiesmarketcap.com

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)