Breaking News

దేశంలో రిచెస్ట్ జిల్లా తెలంగాణలోనే..

Published on Fri, 07/24/2026 - 11:56

భారతదేశ ఆర్థిక వ్యవస్థలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సంప్రదాయక ఆర్థిక రాజధాని ముంబైని అధిగమించి అత్యధిక తలసరి జీడీపీ సాధించిన జిల్లాల జాబితాలో తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ‘ఇన్‌ఫ్రామంత్రా’ ఆర్థిక గణాంకాల ఆధారంగా రూపొందించిన ఈ నివేదిక ఒక ప్రాంతంలో ప్రతి వ్యక్తి అందించే సగటు ఆర్థిక విలువను (తలసరి ఆదాయం) ప్రతిబింబిస్తుంది. ఐటీ, ఫార్మా, పరిశ్రమలు, పర్యాటక రంగాల మద్దతుతో దేశంలో అత్యధిక తలసరి జీడీపీ నమోదు చేసిన టాప్-10 సంపన్న జిల్లాల వివరాలు కింది విధంగా ఉన్నాయి.

దేశంలో అత్యంత సంపన్న జిల్లాలు

ర్యాంక్జిల్లా పేరురాష్ట్రంతలసరి జీడీపీ
1రంగారెడ్డితెలంగాణరూ.11.46 లక్షలు
2గురుగ్రామ్ (గుర్గావ్)హరియాణారూ.9.05 లక్షలు
3బెంగళూరు అర్బన్కర్ణాటకరూ.8.93 లక్షలు
4గౌతమ్ బుద్ధ నగర్ (నోయిడా)ఉత్తరప్రదేశ్రూ.8.48 లక్షలు
5సోలన్హిమాచల్ ప్రదేశ్రూ.8.10 లక్షలు
6ఉత్తర, దక్షిణ గోవాగోవారూ.7.63 లక్షలు
7సిక్కిం జిల్లాలు (గ్యాంగ్‌టక్‌ తదితరాలు)సిక్కింరూ.7.46 లక్షలు
8దక్షిణ కన్నడ (మంగళూరు)కర్ణాటకరూ.6.69 లక్షలు
9ముంబైమహారాష్ట్రరూ.6.57 లక్షలు
10అహ్మదాబాద్గుజరాత్రూ.6.54 లక్షలు

 

ఈ ఆర్థిక పురోగతి కేవలం పారిశ్రామిక రంగానికే కాకుండా ఈ జిల్లాల్లో ప్రపంచస్థాయి రహదారులు, విమానాశ్రయాలు, లగ్జరీ హోటళ్లు వంటి పర్యాటక మౌలిక సదుపాయాల అభివృద్ధికి కూడా ప్రధాన చోదక శక్తిగా నిలుస్తోంది.

రంగారెడ్డి అగ్రస్థానం వెనుక ఆర్థిక అంశాలు

హైదరాబాద్‌కు అనుబంధంగా ఉన్న రంగారెడ్డి జిల్లా కేవలం పరిపాలనా సరిహద్దులకే పరిమితం కాలేదు. గ్లోబల్ ఐటీ దిగ్గజాలు, భారీ ఫార్మాస్యూటికల్ కంపెనీలు, లైఫ్ సైన్సెస్, బయోటెక్నాలజీ పార్కుల రాకతో ఈ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందింది. మరోవైపు చార్మినార్, గోల్కొండ కోట, చౌమహల్లా ప్యాలెస్ వంటి హైదరాబాద్ చారిత్రక సౌధాలకు ప్రవేశ ద్వారంగా ఉన్న రంగారెడ్డి జిల్లా తన ఆర్థిక పురోగతితో పర్యాటకులకు ప్రపంచస్థాయి ఆతిథ్య, రవాణా వసతులను అందిస్తోంది.

ఇదీ చదవండి: ట్రాఫిక్ రూల్ అతిక్రమిస్తే డిజిటల్ వార్నింగ్‌

#

Tags : 1

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)