Breaking News

ప్రపంచంలోనే అధిక బంగారు నిల్వలున్న దేశాలు

Published on Mon, 02/17/2025 - 11:52

ప్రపంచ వ్యాప్తంగా బంగారానికి(Gold) ఉన్న క్రేజ్‌ అంతాఇంతా కాదు. మన దేశంలో అయితే దీన్ని మరింత విలువైన లోహంగా భావిస్తారు. కొందరు బంగారాన్ని తమ గౌరవానికి సూచికగా భావిస్తే..ఇంకొందరు దీన్నో పెట్టుబడి సాధనంగా చూస్తున్నారు. దాంతో దేశంతోపాటు ప్రపంచ వ్యాప్తంగా పసిడికి డిమాండ్‌ పెరుగుతూనే ఉంది. ఇటీవల దీని తులంధర ఏకంగా రూ.88 వేలు దాటిపోయింది. త్వరలో బంగారం రేటు రూ.ఒక లక్ష కూడా చేరే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదిలాఉండగా, ప్రపంచవ్యాప్తంగా ఏయే దేశాల్లో అధికంగా బంగారం నిల్వలున్నాయో కింద తెలుసుకుందాం.

  1. యునైటెడ్‌ స్టేట్స్‌ 8,133.46 టన్నులు

  2. జర్మనీ 3,351.53 టన్నులు

  3. ఇటలీ 2,451.84 టన్నులు

  4. ఫ్రాన్స్ 2,436.94 టన్నులు

  5. చైనా 2,264.32 టన్నులు

  6. స్విట్జర్లాండ్ 1,039.94 టన్నులు

  7. భారతదేశం 853.63 టన్నులు

  8. జపాన్ 845.97 టన్నులు

  9. తైవాన్, చైనా 422.69 టన్నులు

  10. పోలాండ్ 419.70 టన్నులు

ఇదీ చదవండి: అంకెలు మారాయి కానీ.. ప్రశ్న మారలేదు..

చైనాలో భారీ బంగారు గని

చైనాలోని హునాన్ ప్రావిన్స్‌లోని పింగ్ జియాంగ్ కౌంటీలో ఇటీవల సుమారు రూ.7,09,577,16,96,000 విలువైన ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు నిల్వల గనిని కనుగొన్నారు. ఈ నిక్షేపం వాంగు గోల్డ్‌ఫీల్డ్స్‌లో బయటపడినట్లు తెలియజేస్తున్నారు. ఇక్కడ భూగర్భ శాస్త్రవేత్తలు 2,000 మీటర్ల లోతు వరకు విస్తరించిన 40 బంగారు నిక్షేపాలను గుర్తించారు. ప్రాథమిక అంచనాల ప్రకారం వీటిలో కనీసం 300 మెట్రిక్ టన్నుల బంగారం ఉందని తేలినట్లు సమాచారం. 3,000 మీటర్ల వరకు విస్తరించిన లోతైన ఈ గనిలో మరింత నిల్వలు ఉండవచ్చని అంచనా. దాంతో ఇందులో మొత్తంగా సుమారు 1,000 మెట్రిక్ టన్నుల వరకు బంగారం ఉంటుందని కొన్ని మీడియా సంస్థలు తెలిపాయి.

#

Tags : 1

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)