Breaking News

ఫోర్బ్స్ ఇండియా బిలియనీర్స్ జాబితా: టాప్ 10లో ఒక్క మహిళ

Published on Thu, 10/09/2025 - 15:13

భారతదేశంలోని అత్యంత ధనవంతులైన 100 మంది వ్యక్తుల జాబితాను.. ఫోర్బ్స్ ఇండియా (Forbes India) రిలీజ్ చేసింది. ఈ విషయాన్ని తన ఎక్స్ ఖాతాలో వెల్లడించింది. ఈ జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ 'ముకేశ్ అంబానీ' (Mukesh Ambani) అగ్రస్థానంలో నిలిచారు.

105 బిలియన్ డాలర్ల నికర విలువతో ముకేశ్ అంబానీ.. ప్రధమ స్థానంలో నిలిచారు. గత ఏడాదితో పోలిస్తే ఈయన సంపద 12 శాతం క్షీణించింది. 2వ స్థానంలో మౌలిక సదుపాయాల దిగ్గజం గౌతమ్ అదానీ & కుటుంబం 92 బిలియన్ డాలర్ల సంపదతో ఉన్నారు. మొత్తం మీద వందమంది ధనవంతుల సంపద 2025లో 9 శాతం తగ్గింది.

ఓపీ జిందాల్ గ్రూప్‌కు చెందిన సావిత్రి జిందాల్ మూడో స్థానంలో నిలిచారు. వీరి నికర విలువ 3.5 బిలియన్లు తగ్గి.. 40.2 బిలియన్ డాలర్లకు చేరుకుంది. టాప్ 10 జాబితాలో ఉన్న మహిళగా ఈమె రికార్డ్ క్రియేట్ చేశారు. టెలికాం దిగ్గజం సునీల్‌ మిట్టల్, టెక్ బిలియనీర్ శివ నాడార్ వరుసగా నాలుగు, ఐదోస్థానంలో నిలిచారు.

ఇదీ చదవండి: 'రేటు మరింత పెరగకముందే.. కొనేయండి': రాబర్ట్ కియోసాకి

భారతదేశంలోని టాప్ 10 బిలినీయర్స్
➤ముకేశ్ అంబానీ: 105 బిలియన్ డాలర్లు
➤గౌతమ్ అదానీ & కుటుంబం: 92 బిలియన్ డాలర్లు
➤సావిత్రి జిందాల్: 40.2 బిలియన్ డాలర్లు
➤సునీల్ మిట్టల్ & కుటుంబం: 34.2 బిలియన్ డాలర్లు
➤శివ్ నాడర్: 33.2 బిలియన్ డాలర్లు
➤రాధాకిషన్ దమానీ & కుటుంబం: 28.2 బిలియన్ డాలర్లు
➤దిలీప్ షాంఘ్వీ: 26.3 బిలియన్ డాలర్లు
➤బజాజ్ కుటుంబం: 21.8 బిలియన్ డాలర్లు
➤సైరస్ పూనవల్లా: 21.4 బిలియన్ డాలర్లు
➤కుమార్ మంగళం బిర్లా: 20.7 బిలియన్ డాలర్లు

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)