Breaking News

టమాటా షాక్‌: ఇప్పట్లో తగ్గేదే లేదు, కారణాలివిగో..!

Published on Thu, 08/03/2023 - 11:25

ఎక్కడ చూసినా టమాటా మాటలు.. మంటలే.. సూపర్‌ బ్యాట్‌మెన్స్‌తో  పోటీపడుతూ సెంచరీ..డబుల్‌ సెంచరీ.. దాటేసి ట్రిపుల్‌ సెంచరీ వైపు దూసుకుపోతోంది. ఇప్పటికే అందనంత ఎత్తుకు ఎదిగి సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్న టమాట ధరలు ఇంకా పైపైకి దూసుకు పోతున్నాయి. దేశంలో చాలా ప్రాంతాల్లో  రూ. 250  స్థాయిని కూడా దాటేసింది.  తాజాగా మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. త్వరలోనే కేజీకి రూ. 300 లకు చేరే అవకాశముంది. (విమాన ప్రయాణీకులకు బంపర్‌ ఆఫర్‌:మెగా సేల్‌)

నెల రోజులుగా టమాటా ధరలు పెరుగుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో  కిలో రూ.300లకు చేరుకుంటుందని హోల్‌సేల్ వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. టమాట రాక తగ్గడంతో హోల్ సేల్ ధరలు పెరుగుతాయని హోల్ సేల్ వ్యాపారులు తెలిపారు. దాని ప్రభావం చిల్లర ధరల పెరుగుదల కనిపిస్తుందని అంటున్నారు. దీనికి తోడు భారీ వర్షాలుకూడా మరింత అగ్గి రాజేస్తున్నాయి. ఢిల్లీలోని ఆజాద్‌పూర్ టమోటా అసోసియేషన్ అధ్యక్షుడు, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ (ఏపీఎంసీ) సభ్యుడు అశోక్ కౌశిక్ మాట్లాడుతూ.. గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురియడంతో సాగులో పంట దెబ్బతినడంతో టమోటాల రాక తగ్గింది. అలాగే టమోటాలు, క్యాప్సికం, ఇతర సీజనల్ కూరగాయల విక్రయాలు భారీగా తగ్గిపోవడంతో కూరగాయల హోల్‌సేల్ వ్యాపారులు నష్టాలను ఎదుర్కొంటున్నారన్నారు. (నితిన్‌ దేశాయ్‌ అకాల మరణం: అదే కొంప ముంచింది!)

 వర్షాలు, సరఫరా,రవాణా ఇబ్బందులు
ప్రధానంగా సాగుచేసే ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో నెల రోజులుగా టమాటా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఆజాద్‌పూర్ కూరగాయల మార్కెట్ హోల్‌సేలర్ సంజయ్ భగత్   “హిమాచల్ ప్రదేశ్‌లో కొండచరియలు విరిగిపడటం , భారీ వర్షాల కారణంగా, కూరగాయల రవాణాలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. సాగుదారుల నుంచి కూరగాయలు తీసుకురావడానికి సాధారణం కంటే ఆరు-ఎనిమిది గంటలు ఎక్కువ సమయం పడుతోంది. ఫలితంగా ధర పెరగడంతో పాటు, కూరగాయల నాణ్యతపై ప్రభావం పడుతోందన్నారు. మొత్తంగా టమాటా ధర కిలో రూ.300కి చేరడం ఖాయమంటున్నారు. 

కాగా  ధర విపరీతంగా పెరిగిన  నేపథ్యంలో జులై 14 నుంచి కేంద్ర ప్రభుత్వం టమాటాలను సబ్సిడీపై విక్రయిస్తోంది. దీని కారణంగా దేశ రాజధాని ఢిల్లీలో చిల్లర ధరలు తగ్గుముఖం పట్టినప్పటికీ, సరఫరా కొరత కారణంగా ధరలు మళ్లీ  ఊపందుకున్నాయి. అటు మదర్ డెయిరీ తన ‘సఫాల్ స్టోర్స్’ ద్వారా కిలో రూ.259కి టమాట విక్రయిస్తోంది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)