పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!
Breaking News
ఫస్ట్‌టైమ్ బంగారం ధర ఎంతకు చేరిందంటే..
Published on Wed, 03/19/2025 - 12:11
స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం ధర బుధవారం జీవితకాల గరిష్టాలను చేరింది. సమీప భవిష్యత్తులో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని కొందరు అంచనా వేస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో బుధవారం రోజున గోల్డ్ రేట్లు(Today Gold Rates) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.
హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.82,900 (22 క్యారెట్స్), రూ.90,440 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. మంగళవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.400, రూ.440 పెరిగింది.
ఇదీ చదవండి: స్టార్‌లింక్ సర్వీసులపై స్పెక్ట్రమ్ ఫీజు?
చెన్నైలో బుధవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.400, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.440 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.82,900 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.90,440 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.
దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.400 పెరిగి రూ.83,050కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.440 పెరిగి రూ.90,590 వద్దకు చేరింది.
వెండి ధరలు
బంగారం ధరల మాదిరిగానే బుధవారం వెండి ధర(Silver Prices)ల్లోనూ మార్పులు కనిపించాయి. నిన్నటి ధరలతో పోలిస్తే వెండి కేజీపై ఏకంగా రూ.1,000 పెరిగి రూ.1,14,000 వద్దకు చేరింది.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)
Tags : 1