Breaking News

దిగొచ్చిన బంగారం, వెండి!! ఎంత తగ్గాయంటే..

Published on Wed, 06/26/2024 - 15:16

దేశవ్యాప్తంగా గత ఐదు రోజులుగా బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. నిన్నటి రోజున స్థిరంగా కొనసాగిన బంగారం ధరలు బుధవారం (జూన్‌ 26) కాస్త దిగివచ్చాయి. దీంతో కొనుగోలుదారులకు ఉపశమనం లభించినట్లయింది.

హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన నగరాలు సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు (తులం) ధర రూ.250 తగ్గి రూ.66,000 లకు దిగొచ్చింది. అలాగే 24 క్యారెట్ల పసిడి కూడా రూ.230 క్షీణించింది. దీంతో తులం మేలిమి బంగారం రూ. 72,000 లకు తగ్గింది.

దేశంలోని ఇతర నగరాల్లో..
ఢిల్లీలో 22 క్యారెట్ల స్వర్ణం 10 గ్రాముల ధర రూ.250 తగ్గి రూ.66,150 లకు, 24 క్యారెట్ల బంగారం రూ.230 క్షీణించి రూ.72,150 లకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.250 తగ్గి రూ.66,000 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.230 క్షీణించి రూ. 72,000 లకు దిగొచ్చింది.

ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల రేటు రూ.200 తగ్గి రూ.66,600 ల​కు చేరింది. 24 క్యారెట్ల బంగారం కూడా రూ.220 దిగొచ్చి రూ.72,660 లకు చేరింది. బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.250 తగ్గి రూ.66,000 లకు దిగొచ్చింది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.230 క్షీణించి రూ. 72,000 లకు తగ్గింది.

వెండి ధరలు
దేశవ్యాప్తంగా బంగారం ధరలతోపాటు వెండి ధరలు కూడా బుధవారం తగ్గాయి. హైదరాబాద్‌లో వెండి ధర ఈరోజు కేజీకి రూ.1000 చొప్పున తగ్గింది. ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి ధర రూ.94,500లకు క్షీణించింది.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)