Breaking News

వామ్మో! హీటెక్కుతున్న బంగారం ధరలు

Published on Tue, 08/29/2023 - 17:38

Today Gold and Silver prices: బంగారం,  వెండి ధరలు మళ్లీ మండుతున్నాయి. ఆల్‌ టై హై నుంచి కొద్దిగా వెనక్కి తగ్గినప్పటికీ, డాలర్‌ బలంతో మళ్లీ భగ్గుమంటున్నాయి. అంతర్జాతీయంగా, దేశీయంగా గోల్డ్‌, సిల్వర్‌ ధరలు వేగం పుంజకున్నాయి.  హైదరాబాద్‌ లో 22 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ.250  పెరిగి రూ.54,750గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 270పెరిగి రూ. 59,670 పలుకుతోంది. అటు వెండి ధర కూడా పెరిగింది. కిలోకు రూ. 200 పెరిగిన  వెండి ధర కిలోకు  77. 100గా ఉంది.  ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. 

MCX  మార్కెట్‌లో వరుసగా రెండో రోజు జంప్‌
ఆగస్టు 29, మంగళవారం మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో బంగారం , వెండి ధరలు వరుసగా రెండో రోజు కూడా పెరిగాయి. అక్టోబరు 5, 2023న మెచ్యూర్ అయ్యే గోల్డ్ ఫ్యూచర్స్, రూ. 90 లేదా 0.15 శాతం  పెరిగి 10 గ్రాములకు రూ.58,949గా ఉంది.అదేవిధంగా, సెప్టెంబరు 5, 2023న  మెచ్యూరయ్యే  వెండి ఫ్యూచర్లు కూడా రూ. 162 లేదా 0.22 శాతం పెరిగి  కిలోకు రూ. 73,700 వద్ద ట్రేడవుతున్నాయి.

అంతర్జాతీయంగా బంగారం, వెండి ధర
స్పాట్ గోల్డ్ ఔన్స్‌కు 0.3 శాతం పెరిగి 1,924.84కి చేరుకుంది, ఆగస్టు 10 నుండి అత్యధికం. అమెరికా బంగారం ఫ్యూచర్స్ 0.3 శాతం పెరిగి 1,952.90 డాలర్ల వద్ద ఉన్నాయి. వెండి ఔన్స్‌కు 0.3 శాతం పెరిగి 24.32 డాలర్లకు చేరుకుంది. అంతర్జాతీయంగా ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా ఫెడ్  సెప్టెంబర్ పాలసీ నిర్ణయం, ఆగస్ట్ లేబర్ మార్కెట్ డేటా ఆధారంగా బంగారం ధరలు కదలాడుతాయని మార్కెట్‌వర్గాలు అంచనా వేస్తున్నాయి. అటు  డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి స్వల్పంగా నష్టపోయింది.  సోమవారం నాటి ముగింపు 82.62 తో పోలిస్తే మంగళవారం 82.70  వద్ద ముగిసింది. 


 

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)