Breaking News

టైటానిక్‌ మృత్యుంజయుడు రాసిన లేఖ.. రూ.3 కోట్లు పలికింది

Published on Sun, 04/27/2025 - 17:51

టైటానిక్ షిప్ మునిగిపోవడానికి కొన్ని రోజుల ముందు ఒక ప్రయాణికుడు (కల్నల్ ఆర్చిబాల్డ్ గ్రేసీ) రాసిన లేఖ యూకేలో జరిగిన వేలంలో రికార్డు స్థాయిలో.. సుమారు రూ. 3.4 కోట్లకు అమ్ముడైంది. విల్ట్‌షైర్‌లోని హెన్రీ ఆల్డ్రిడ్జ్ అండ్ సన్ నిర్వహించిన వేలంలో దీనిని విక్రయించారు.

టైటానిక్ ఒక మంచుకొండను ఢీకొని ఉత్తర అట్లాంటిక్ మంచు నీటిలో మునిగిపోవడానికి కొన్ని రోజుల ముందు 'కల్నల్ ఆర్చిబాల్డ్ గ్రేసీ' రాసిన ఈ లేఖ.. 1912 ఏప్రిల్ 10న సౌతాంప్టన్ నుంచి రాసినట్లు తెలుస్తోంది. ఇందులో "ఇది మంచి షిప్, కానీ నేను దీనిపై తీర్పు చెప్పే ముందు నా ప్రయాణాలు ముగిసే వరకు వేచి ఉండాలి" అని ఉంది.

1912 ఏప్రిల్ 15 తెల్లవారుజామున టైటానిక్ ఒక మంచుకొండను ఢీకొని మునిగిపోయిన తరువాత సుమారు 1500 మందికి పైగా మరణించారు. అయితే ఈ ప్రమాదంలో బతికి బయటపడిన అతి తక్కువ మందిలో గ్రేసీ ఒకరు. 1913లో ఈయన మరణించిన తరువాత.. ప్రచురించబడిన తన 'ది ట్రూత్ ఎబౌట్ ది టైటానిక్' పుస్తకంలో తాను తప్పించుకున్న విషయాన్ని వివరించాడు.

ఇదీ చదవండి: ప్రెగ్నెన్సీ సమయంలో కాలేయ వ్యాధి: ఇప్పుడు ఓ కంపెనీ అధినేత్రి..

ఆ పుస్తకంలో.. ఓడ మునిగిపోయిన తర్వాత, మంచు నీటిలో బోల్తా పడిన లైఫ్ బోట్‌ను ఎక్కి తాను ఎలా బయటపడ్డాడో వివరించాడు. మొదట లైఫ్ బోట్ చేరుకున్న వారిలో సగానికి పైగా అలసట లేదా చలి కారణంగా మరణించారని ఆయన రాశారు.

కల్నల్ గ్రేసీ ఆ విపత్తు నుంచి బయటపడినప్పటికీ, అతితక్కువ ఉష్ణోగ్రత కారణంగా.. గాయాల వల్ల ఆరోగ్యం పాడైంది. ఆ తరువాత డయాబెటిస్ సమస్యలతో.. డిసెంబర్ 1912లో మరణించారు. అయితే ఆయన మరణానంతరం ఈ లేఖ భారీ మొత్తానికి అమ్ముడైంది.

#

Tags : 1

Videos

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

Photos

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)