Breaking News

రైడింగ్ సమయంలో పెట్రోల్ అదా ఇలా: టిప్స్

Published on Sat, 12/20/2025 - 21:09

మోటార్ సైకిల్ లేదా కారు కొనే ఎవరైనా ఎక్కువ మైలేజ్ ఇచ్చే వాహనాలనే కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. అయితే కొన్ని రోజుల తరువాత ఆ వాహనాల మైలేజ్ కొంత తగ్గే సూచనలు కనిపించవచ్చు. దీనికి కారణం ఏమై ఉంటుందా? అని చాలామంది ఆలోచిస్తూ.. తలలు పట్టుకుంటారు. బండి మైలేజ్ ఎందుకు తగ్గుతుంది? ఏం చేస్తే.. మైలేజ్ పెరుగుతుందనే విషయాలు ఈ కథనంలో..

వాహనాల మైలేజ్ తగ్గడానికి కారణాలు
కొత్తగా కొన్న కారు లేదా మోటార్ సైకిల్ మంచి మైలేజ్ అందిస్తుంది. అయితే కొన్ని రోజుల తరువాత మైలేజ్ క్రమంగా తగ్గుతుంది. దీనికి కారణం.. టైర్ ప్రెషర్ తక్కువగా ఉండటం, ఎయిర్ ఫిల్టర్ బ్లాక్ అవ్వడం, స్పార్క్ ప్లగ్ పాడవ్వడం, ఇంజిన్ ఆయిల్, సమయానికి సర్వీసింగ్ చేయించకపోవడం మొదలైనవని తెలుస్తోంది.

అంతే కాకుండా.. అకస్మాత్తుగా బండి వేగం పెంచడం, బ్రేక్ వేయడం, గేర్ సరిగా మార్చకపోవడం, క్లచ్‌ను ఎక్కువగా నొక్కి ఉంచడం, ట్రాఫిక్‌లో ఎక్కువగా ఆగి మళ్లీ స్టార్ట్ చేయడం, వాహనంపై ఎక్కువ బరువు వేసుకోవడం, నాణ్యతలేని పెట్రోల్ / డీజిల్, సరైన రోడ్లు లేకపోవడం వంటి కారణాల వల్ల కూడా.. మైలేజ్ తగ్గవచ్చు.

ఫ్యూయెల్ ఆదా కోసం

  • రైడింగ్ సమయంలో.. ఒక్కసారిగా వేగం పెంచకుండా.. సాఫ్ట్‌గా యాక్సిలరేట్ చేయాలి.

  • ఎక్కువ RPMలో రైడ్ చేయడం ఫ్యూయెల్ ఎక్కువగా ఖర్చు చేస్తుంది. కాబట్టి సరైన గేర్ వాడాలి.

  • అనవసరంగా స్పీడ్ పెంచకూడదు. స్థిరమైన స్పీడ్‌లో బండి నడపాలి.

  • ఎక్కువ సేపు స్టాప్‌లో ఉంటే (సిగ్నల్ వద్ద) ఇంజిన్ ఆఫ్ చేయండి. ఇలా చేయడం వల్ల కొంత ఫ్యూయెల్ ఆదా అవుతుంది.

  • టైర్ ప్రెషర్ తక్కువగా ఉంటే.. కూడా మైలేజ్ తగ్గుతుంది. టైర్ ప్రెషర్ చెక్ చేసుకోవడం మంచిది.

  • ఎయిర్ ఫిల్టర్, స్పార్క్ ప్లగ్ క్లీన్‌గా ఉండేలా చూసుకోవాలి. ఎప్పటికప్పుడు సర్వీస్ చేయించాలి.

  • అనవసరంగా ఎక్కువ బరువులు వేయకూడదు. ఎక్కువసేపు క్లచ్ ప్రెస్ చేస్తూ ఉండకూడదు.

ఇదీ చదవండి: ఎయిర్ పొల్యుషన్ ఎఫెక్ట్: BS6 vs BS4 వాహనాల మధ్య తేడా..

#

Tags : 1

Videos

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు