Breaking News

తొలి భారతీయ కంపెనీగా ఇన్ఫోసిస్‌ ఘనత: దిగ్గజ కంపెనీల ప్లేస్‌ ఎక్కడ?

Published on Fri, 09/15/2023 - 13:22

TIME World100 Best Companies List Infosys ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ లిమిటెడ్ టైమ్ ప్రపంచంలోని 100 అత్యుత్తమ కంపెనీల లిస్ట్‌లో చోటు సంపాదించుకుంది. అంతేకాదు ఈ జాబితాలో  చోటు దక్కించుకున్న  భారతీయ సంస్థ ఇన్ఫోసిస్ మాత్రమే  కావడం విశేషం. ప్రపంచ దిగ్గజ కంపెనీలకు ధీటుగా 64 వ స్థానంలో ఇన్ఫీ తనప్రత్యేకతను చాటుకుంది. అలాగే  ప్రపంచంలోని   తొలి మూడు ప్రొఫెషనల్ సేవల కంపెనీలలో ఒకటిగా కూడా ఇన్ఫోసి నిలిచింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు  ఊతమిస్తున్న  కంపెనీల ర్యాంకింగ్‌లో మొత్తం 750 కంపెనీలను పేర్కొన్నాయి. అయితే ఇన్ఫోసిస్‌తో పాటు, మరో ఏడు భారతీయ కంపెనీలు  750 కంపెనీలున్న  టైమ్‌ జాబితాలో ప్లేస్‌ దక్కించుకున్నాయి. 

టైమ్ మ్యాగజైన్ , ఆన్‌లైన్ డేటా ప్లాట్‌ఫారమ్ స్టాటిస్టా సంకలనం చేసిన  2023 ప్రపంచ అత్యుత్తమ కంపెనీల టాప్ 100 జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ కంపెనీ ఇన్ఫోసిస్. ఈ  జాబితాలో  మైక్రోసాఫ్ట్, యాపిల్, ఆల్ఫాబెట్ (గూగుల్‌ మాతృసంస్థ) మెటా లాంటి టెక్ కంపెనీలు టాప్‌లో ఉన్నాయి. రాబడి వృద్ధి, ఉద్యోగుల సంతృప్తి సర్వేలు , పర్యావరణ హిత విధానాలు,  సామాజిక , కార్పొరేట్ గవర్నెన్స్ (ESG, లేదా సుస్థిరత) డేటా ఆధారంగా  ఆ  ర్యాంకింగ్‌లను కేటాయించారు.  ఒకప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నడిపించిన తయారీదారులు, వినియోగ వస్తువుల కంపెలు, ఫాస్ట్‌ మూవింగ్‌ టెక్  ర్యాంకింగ్‌లున్నాయి.

టెక్ కంపెనీలు బాగా పనిచేశాయి. ఎందుకంటే వాటి కార్బన్ ఉద్గారాలు విమానయాన సంస్థలు, హోటళ్లు లేదా పెద్ద తయారీదారులు వంటి ముఖ్యమైన భౌతిక పాదముద్రలు కలిగిన ఇతర రకాల కంపెనీల కంటే చాలా తక్కువగా ఉన్నాయని టైమ్‌ పేర్కొంది. వారి ఉద్యోగులు చాలా సంతోషంగా ఉన్నారు. ఇది కూడా వారు కూడా మంచి ర్యాంక్‌ను పొందడానికి కారణం. ఉద్యోగుల ర్యాంకింగ్‌లలో తొలి నాలుగు కంపెనీలు  అత్యధిక మార్కులు పొందాయి. గత మూడేళ్లలో గణనీయ మైన లాభాలను పోస్ట్ చేసారు. వారు సామాజిక పాలన సూత్రాలకు కట్టుబడి ఉన్నారు. అలాగే ఉద్గారాలను తగ్గించడంతో కృషి,  వారి వారి బోర్డులలో ఎక్కువ మంది మహిళలను నియమించడం వంటివి  దోహద పడ్డాయని  తెలిపింది.

ఇక ఈ జాబితాలో విప్రో లిమిటెడ్ 174వ స్థానంలో, మహీంద్రా గ్రూప్ 210వ స్థానంలో, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 248వ స్థానంలో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ లిమిటెడ్  262వ స్థానంలో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 418వ స్థానంలో, WNS గ్లోబల్ సర్వీసెస్ 596వ స్థానంలో, ఐటీసీ లిమిటెడ్ 596వ స్థానంలో నిలిచాయి.
 

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)