Breaking News

తిలక్‌నగర్‌ చేతికి ఇంపీరియల్‌ బ్లూ

Published on Thu, 07/24/2025 - 06:25

ముంబై: దేశీ లిక్కర్‌ కంపెనీ తిలక్‌నగర్‌ ఇండస్ట్రీస్‌ తాజాగా సుప్రసిద్ధ విస్కీ బ్రాండ్‌ ఇంపీరియల్‌ బ్లూను సొంతం చేసుకోనుంది. ఇందుకు ఫ్రెంచ్‌ లిక్కర్‌ దిగ్గజం దేశీ యూనిట్‌ పెర్నాడ్‌ రికార్డ్‌ ఇండియాతో తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. డీల్‌ ప్రకారం రూ. 4,150 కోట్ల ఎంటర్‌ప్రైజ్‌ విలువలో కొనుగోలు చేయనుంది. దీనిలో రూ. 282 కోట్లు లావాదేవీ ముగిసిన నాలుగేళ్ల తదుపరి చెల్లించేందుకు వీలుంది. డీల్‌ వివరాలను రెండు సంస్థలూ వెల్లడించాయి.

 కాగా.. ఈ డీల్‌ ద్వారా పాప్యులర్‌ బ్రాందీ బ్రాండ్‌ మ్యాన్షన్‌ హౌస్‌ను ఉత్పత్తి చేసే తిలక్‌నగర్‌ విస్కీ విభాగంలోనూ సుప్రసిద్ధ బ్రాండ్‌ను సొంతం చేసుకోనుంది. వెరసి దేశీ తయారీ విదేశీ మద్యం(ఐఎంఎఫ్‌ఎల్‌) విభాగంలో రెండు భారీ బ్రాండ్లను విక్రయించేందుకు వీలు చిక్కనుంది. అమ్మకాల పరిమాణంరీత్యా ఇంపీరియల్‌ బ్లూ దేశీయంగా మూడో పెద్ద విస్కీ బ్రాండ్‌గా నిలుస్తోంది. గతేడాది(2024–25) రూ. 3,067 కోట్ల అమ్మకాలు సాధించింది. రెండు సొంత యూనిట్లు, బాట్లింగ్‌ సహతయారీ సర్వీసులు డీల్‌లో భాగంకానున్నాయి. 
షేరు పరుగు..

కొనుగోలు వార్తల నేపథ్యంలో తిలక్‌నగర్‌ ఇండస్ట్రీస్‌ షేరు గత కొద్ది రోజులుగా బలపడుతూ వస్తోంది. తాజాగా బీఎస్‌ఈలో 0.7 శాతం లాభపడి రూ. 473 వద్ద ముగిసింది. గత నెల రోజుల్లో 30 శాతంపైగా లాభపడటం గమనార్హం! ఈ ఏప్రిల్‌ 7న రూ. 205 వద్ద ఏడాది కనిష్టాన్ని తాకిన షేరు మంగళవారానికల్లా(22న) రూ. 488 వద్ద 52 వారాల గరిష్టానికి చేరింది!! 

#

Tags : 1

Videos

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)