Breaking News

ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అధిక వడ్డీ ఇచ్చే బ్యాంకులు

Published on Sun, 11/23/2025 - 16:05

పెట్టుబడి సురక్షితంగా ఉండాలనుకునే పెట్టుబడిదారులు.. ఫిక్స్‌డ్ డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేస్తారు. ఇక్కడ మీ డబ్బు సురక్షితంగా ఉండటమే కాకుండా, స్థిర రాబడి కూడా పొందవచ్చు. అయితే ఇందులో పెద్ద మొత్తంలో లాభం రాకపోయినా.. నష్టం మాత్రం ఉండదు. అయితే మీకు వచ్చే రాబడి వివిధ బ్యాంకులు అందించే వడ్డీ రేట్ల మీద ఆధారపడి ఉంటుంది. ఈ కథనంలో ఏ బ్యాంక్ ఎంత వడ్డీ ఇస్తుందో తెలుసుకుందాం.

సాధారణంగా వడ్డీ రేట్లలో పెద్దగా తేడా ఉండదు, కానీ 50 బేసిస్ పాయింట్ల చిన్న వ్యత్యాసం కూడా మీ పెట్టుబడిని గణనీయంగా పెంచుతుంది. లాభం అనేది ముఖ్యంగా పెట్టుబడి పెట్టిన మొత్తం గణనీయంగా ఉన్నప్పుడు & కాలపరిమితి ఎక్కువగా ఉన్నప్పుడు ఆశించవచ్చు.

ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు

  • HDFC బ్యాంక్: ఈ బ్యాంక్ సాధారణ పౌరులకు మూడేళ్ల కాలపరిమితి డిపాజిట్‌పై 6.45%, సీనియర్ సిటిజన్లకు 6.95% అందిస్తుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్ అనేది 18 నెలల నుంచి 21 నెలల మధ్య కాలపరిమితి ఉన్నప్పుడు ఈ బ్యాంక్ కొంత ఎక్కువ వడ్డీ అందిస్తుంది.

  • ICICI బ్యాంక్: ఈ ప్రైవేట్ రంగ బ్యాంకు.. సాధారణ పౌరులకు మూడేళ్ల కాలపరిమితి గల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.6% వడ్డీని, సీనియర్ సిటిజన్లకు 7.2% వడ్డీని అందిస్తుంది.

  • కోటక్ మహీంద్రా బ్యాంక్: ఇది మూడు సంవత్సరాల కాలపరిమితి కలిగిన సాధారణ పౌరులకు 6.4%, సీనియర్ సిటిజన్లకు 6.9% వడ్డీని అందిస్తుంది. అయితే, 391 రోజుల నుంచి రెండు సంవత్సరాల కంటే తక్కువ కాలపరిమితి కలిగినప్పుడు.. బ్యాంక్ అత్యధికంగా 6.7%, 7.2% వడ్డీని అందిస్తుంది.

  • ఫెడరల్ బ్యాంక్: ఈ ప్రైవేట్ రంగ బ్యాంకు తన మూడు సంవత్సరాల డిపాజిట్లపై సాధారణ పౌరులకు 6.7% & సీనియర్ సిటిజన్లకు 7.2% వడ్డీని అందిస్తుంది. అత్యధిక వడ్డీ ఇచ్చే బ్యాంకుల జాబితాలో ఇది ఒకరి కావడం గమనార్హం.

  • స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI): భారతదేశంలోని అతిపెద్ద బ్యాంకు అయిన.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన మూడేళ్ల డిపాజిట్లపై సాధారణ పౌరులకు 6.3% వడ్డీని & సీనియర్ సిటిజన్లకు 6.8% వడ్డీని అందిస్తుంది. రెండు, మూడు సంవత్సరాల మధ్య కాలపరిమితి ఉన్నప్పుడు కొంత ఎక్కువ వడ్డీ (6.45% & 6.95%) అందిస్తుంది.

  • కెనరా బ్యాంక్: ఈ బ్యాంక్ మూడు సంవత్సరాల డిపాజిట్లపై సాధారణ పౌరులకు 6.25% & సీనియర్ సిటిజన్లకు 6.75 వడ్డీని ఇస్తుంది. అయితే, 444 రోజుల కాలపరిమితి ఉన్నప్పుడు అత్యధిక రేట్లు (6.5% & 7%) పొందవచ్చు.

  • యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: ఇది మూడు సంవత్సరాల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సాధారణ పౌరులకు 6.6% & సీనియర్ సిటిజన్లకు 7.1% వడ్డీని అందిస్తుంది.

ఇదీ చదవండి: 50/30/20 రూల్: పొదుపు చేయడానికి ఉత్తమ మార్గం!

Videos

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)