Breaking News

ఇల్లు కొనేవాళ్లు.. ఇ​ప్పుడేం చూస్తున్నారు..?

Published on Mon, 03/24/2025 - 12:20

గృహ కొనుగోలుదారుల అభిరుచులు మారుతున్నాయి. గతంలో ధర ప్రాధాన్యంగా గృహ కొనుగోలు నిర్ణయం తీసుకునే కస్టమర్లు.. ఆ తర్వాత వసతులను పరిగనలోకి తీసుకున్నారు. కానీ, కరోనా తర్వాతి నుంచి ఆరోగ్యంపై శ్రద్ధ పెరగడంతో ఇంటి ఎంపికలోనూ ఇదే ధోరణి అవలంబిస్తున్నారు. ధర, సౌకర్యాలే కాదు ఇంటికి చేరువలో ఎలాంటి మౌలిక వసతులు ఉన్నాయి? ఆఫీసులు, వినోద కేంద్రాలు ఎంత దూరంలో ఉన్నాయనే అంశాలను సైతం పరిగనలోకి తీసుకొని గృహాలను ఎంపిక చేస్తున్నారు.     –సాక్షి, సిటీబ్యూరో

ఆరోగ్యానికి ప్రాధాన్యం.. 
నేటి యువతరం ఇల్లు కొనేటప్పుడు చుట్టుపక్కల ఆరోగ్య సౌకర్యాలు ఎలా ఉన్నాయనేది ప్రధానంగా చూస్తున్నారు. అత్యవసరంలో ఎంత సమయంలో ఆస్పత్రికి చేరుకోవచ్చు? ఎంత దగ్గరలో వైద్య సదుపాయాలు ఉన్నాయనేది ఆరా తీస్తున్నారు. ఇంట్లో పిల్లలు, పెద్దల ఆరోగ్య అవసరాల రీత్యా వీటికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు.

ఆట స్థలాలు.. 
ఇల్లు విశాలంగా ఉండటమే కాదు కమ్యూనిటీలో సకల సౌకర్యాలు ఉండాలనేది నేటి గృహ కొనుగోలుదారుల మాట. పిల్లల కోసం క్రీడా సదుపాయాలు, పెద్దలకు క్లబ్‌హౌస్, జిమ్, స్విమ్మింగ్‌ పూల్‌ వంటి సదుపాయాలు ఉండాలని భావిస్తున్నారు. ఎక్కువ ఖాళీ స్థలం వదిలి, పచ్చదనం అధికంగా ఉంటే ఇష్టపడుతున్నారు.

డే కేర్‌ సెంటర్‌.. 
చిన్న కుటుంబాల నేపథ్యంలో పిల్లల ఆలనాపాలనా చూసే డే కేర్‌ సౌకర్యాలు ఉండాలని గృహ కొనుగోలుదారులు చూస్తున్నారు. భార్యాభర్తలిద్దరూ కార్యాలయాలకు వెళితే పిల్లలను చూసుకోవడం కష్టం అవుతుంది. వర్క్‌ ఫ్రం హోమ్‌ ఉన్నా పిల్లలపై శ్రద్ధ పెట్టలేని పరిస్థితి. కాబట్టి కమ్యూనిటీలో డే కేర్‌ సదుపాయాలు ఉండాలని కోరుకుంటున్నారు.

ఆఫీసుకు దగ్గరలో..  
ఇల్లు కొనేటప్పుడు ఆఫీసుకు ఎంత దూరంలో ఉందనేది కస్టమర్ల ప్రాధామ్యాలలో ఒకటి. నగరంలో ట్రాఫిక్‌లోనే అధిక సమయం వృథా అవుతుంది కాబట్టి దూరం, సమయం అనేది ప్రధానంగా మారాయి. ప్రజా రవాణా సౌకర్యాలు ఎలా ఉన్నాయనేది పరిశీలించాకే నిర్ణయం తీసుకుంటున్నారు.

వీకెండ్‌ ఎంజాయ్‌.. 
వీకెండ్‌ వస్తే కుటుంబంతో కలిసి ఆహ్లాదంగా గడిపేందుకు షాపింగ్‌ మాల్స్, థియేటర్లు ఎంత దూరంలో ఉన్నాయనేవి కూడా కొనుగోలు ఎంపికలో భాగమైపోయాయి. పచ్చని ప్రకృతిని ఆస్వాధించాలని కోరుకునే నివాసితులు శివారు ప్రాంతాలలో ఫామ్‌హౌస్‌లు, విల్లాల కొనుగోళ్లకు ఆసక్తి చూపిస్తున్నారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)