Breaking News

మస్క్‌ ముంగిట కనీవినీ ఎరుగని జీతం...

Published on Sat, 09/06/2025 - 13:02

టెక్‌ బిలియనీర్‌, టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ ముంగిటకు కనీవినీ ఎరుగని జీతం  ప్రతిపాదన వచ్చింది. టెస్లా సంస్థ తమ సీఈవో అయిన ఎలాన్ మస్క్‌కు 1 ట్రిలియన్ డాలర్ల (సుమారు రూ.83 లక్షల కోట్ల) విలువైన జీత ప్యాకేజీని ప్రతిపాదించింది. అయితే ఇది సాధారణ జీతం కాదు. పూర్తిగా పనితీరు ఆధారితమైనది. ఈ ప్యాకేజీని పొందాలంటే మస్క్ కొన్ని అసాధారణ లక్ష్యాలను చేరుకోవాలి.

ముఖ్యమైన షరతులు ఇవే..

  • టెస్లా మార్కెట్ విలువను 2 ట్రిలియన్‌ డాలర్లకు తీసుకెళ్లాలి  

  • సంవత్సరానికి 20 మిలియన్ల వాహనాలు డెలివరీ చేయాలి  

  • 10 లక్షల సెల్ఫ్ డ్రైవింగ్ రోబో టాక్సీలు  ఉత్పత్తి చేయాలి

  • 10 లక్షల హ్యూమనాయిడ్ ఏఐ బాట్స్  రూపొందించాలి

  • కనీసం 7.5 సంవత్సరాలు టెస్లాలో కొనసాగాలి  

  • సీఈవో పదవికి వారసత్వ ప్రణాళిక రూపొందించాలి  

ఈ ప్రతిపాదనను టెస్లా వాటాదారుల వార్షిక సమావేశంలో ఓటింగ్‌కు ఉంచనుంది. గతంలో డెలావేర్ కోర్టు కొట్టివేసిన 44.9 బిలియన్ డాలర్ల ప్యాకేజీకి ఇది కొనసాగింపుగా వస్తోంది. భారత విస్తరణలో భాగంగా టెస్లా ఢిల్లీలో ఇటీవల రెండవ షోరూమ్‌ను ప్రారంభించింది. భారతీయ ఈవీ మార్కెట్‌లో మరింత లోతుగా ప్రవేశించేందుకు ఇది కీలక అడుగు.

Videos

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)