Breaking News

టెస్లా కొత్త సైబర్‌ట్రక్‌ విడుదల.. ధర ఎంతంటే..

Published on Fri, 04/11/2025 - 15:21

ప్రముఖ అమెరికా ఎలక్ట్రిక్‌ కార్ల దిగ్గజం టెస్లా యూఎస్‌లో కొత్త సైబర్‌ట్రక్‌ వెర్షన్‌ను విడుదల చేసింది. దీని ప్రారంభ ధరను 69,990 అమెరికన్‌ డాలర్లుగా(రూ.59 లక్షలు) నిర్ణయించింది. ఇది ప్రస్తుతం అందుబాటులో ఉన్న మూడు సైబర్‌ట్రక్‌ మోడళ్లలో చౌకైనదిగా కంపెనీ పేర్కొ​ంది. కొత్త సైబర్‌ట్రక్‌ వేరియంట్‌కు సంబంధించిన రేంజ్, టోవింగ్ సామర్థ్యం, యాక్సిలరేషన్ వంటి స్పెసిఫికేషన్లపై కచ్చితమైన వివరాలు వెల్లడించలేదు.

అమెరికాలో 69,990 డాలర్ల ధరతో ఎంట్రీ లెవల్ సైబర్‌ట్రక్‌ యూఎస్ మార్కెట్‌లో ఆదరణ పొందుతున్న ఫోర్డ్ ఎఫ్-150 లైటనింగ్, రివియన్ ఆర్ 1 టీ వంటి ఇతర ఎలక్ట్రిక్ మోడళ్లతో పోటీ పడుతుందని మార్కెట్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. స్టెయిన్‌లెస్‌ స్టీల్ ఎక్సోస్కెలెటన్, ఆర్మర్డ్ గ్లాస్, అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ సామర్థ్యాలు సైబర్‌ట్రక్‌లో ఉన్నాయని కంపెనీ తెలిపింది.

ఇదీ చదవండి: 'ఎవరూ తప్పించుకోలేరు.. నేనే రెండుసార్లు ఫైన్ కట్టాను'

ఈవీ విభాగంలో టెస్లా ఆధిపత్యాన్ని కొనసాగించడానికి కంపెనీ కొంత కాలంగా ఒత్తిడిని ఎదుర్కొంటోంది. దీనికి తోడు ఆర్థిక అనిశ్చితి, ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ హెచ్చుతగ్గులుండడం వాహన తయారీదారులు ధరలకు సంబంధించి పునరాలోచనలో పడేలా చేశాయి. ఈ నేపథ్యంలో టెస్లా తీసుకున్న నిర్ణయం వినియోగదారులు మరింత సరసమైన ధరలకు కార్లను కొనుగోలు చేసేలా ప్రోత్సహిస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)