Breaking News

సైబర్‌ట్రక్‌ ఆర్డర్లను నిలిపేసిన టెస్లా!

Published on Mon, 08/12/2024 - 15:20

ప్రముఖ ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ సంస్థ టెస్లా సైబర్‌ట్రక్‌ బేసిక్‌ వేరియంట్‌ ఆర్డర్లను నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. ఒకవేళ వినియోగదారులు తక్షణమే సైబర్‌ట్రక్‌ను పొందాలంటే 1 లక్ష డాలర్లు(రూ.83.9 లక్షలు) ధర ఉన్న ప్రీమియం వేరియంట్‌ను ఆర్డర్‌ చేయాలని తెలిపింది.

టెస్లా ప్రతిష్టాత్మకంగా తయారు చేసిన స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ బాడీ కలిగిన సైబర్‌ట్రక్‌ బేసిక్‌ వేరియంట్‌ ధరను 61,000 డాలర్లు(రూ.51.2 లక్షలు)గా నిర్ణయించింది. దాంతో భారీగా ఆర్డర్లు వచ్చాయి. అయితే దీన్ని విక్రయించడం వల్ల కంపెనీకు తక్కువ మార్జిన్‌ వస్తున్నట్లు సమాచారం. సైబర్‌ట్రక్‌ ప్రీమియం వేరియంట్‌ ధరను 1 లక్ష డాలర్లు (రూ.83.9 లక్షలు)గా ఉంచారు. దాంతో దీనికి డిమాండ్‌ తగ్గిపోయింది. ఈ రెండు వేరియంట్లు కలిపి ఇప్పటివరకు దాదాపు 10 లక్షల యూనిట్లను ఆర్డర్‌ చేసుకున్నారని ఇలాన్‌మస్క్‌ తెలిపారు. ఇందులో బేసిక్‌ వేరియంట్‌ ఆర్డర్లను నిలిపేస్తున్నట్లు ప్రకటించడంతో ఇకపై సైబర్‌ట్రక్‌ కావాలనుకునేవారు ప్రీమియం మోడల్‌ను బుక్‌ చేసుకోవాలని కంపెనీ తెలిపింది. దానివల్ల మార్జిన్‌ పెరిగి కంపెనీ బ్యాలెన్స్‌షీట్‌లో రెవెన్యూ అధికమవుతుందని భావిస్తోంది. ఒకవేళ కస్టమర్లు ప్రీమియం మోడల్‌ను ఆర్డర్‌చేస్తే ఈ నెలలోనే డెలివరీ ఇస్తామని హామీ ఇస్తుంది. ఏలాగైనా ఈ ఏడాదిలో వీటి అమ్మకాలను 2 లక్షలకు తీసుకెళ్లాలని యోచిస్తోంది.

‘కాక్స్ ఆటోమోటివ్’ తెలిపిన వివరాల ప్రకారం..టెస్లా జులైలో దాదాపు 4,800 సైబర్‌ట్రక్ ప్రీమియం యూనిట్లను విక్రయించింది.  ఇది యూఎస్‌లో 1 లక్ష డాలర్ల ధర శ్రేణిలో అత్యధికంగా అమ్ముడైన వాహనంగా నిలిచింది. అయితే ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు కేవలం 16,000 యూనిట్లు మాత్రమే విక్రయించారు. ఆ సంఖ్యను పెంచడం కంపెనీకి సవాలుగా మారుతుంది.

ఇదీ చదవండి: సీఈఓల జీతాలు పెంపు!

ఇదిలాఉండగా, టెస్లా నవంబర్ 2023లో సైబర్‌ట్రక్‌ను ఆవిష్కరించింది. బేసిక్‌ వేరియంట్‌ కార్లను 2025లో డెలివరీ ఇస్తామని లక్ష్యంగా చేసుకుంది. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 511 కిలోమీటర్ల వరకు వెళ్లే డ్యుయల్‌ మోటార్‌ వేరియంట్‌ను(ధర రూ.83.9 లక్షలు) ఆర్డర్‌ చేస్తే ఈ నెలలోనే డెలివరీ ఇ‍స్తామని ప్రకటించింది. ‘ట్రై-మోటార్‌ వేరియంట్‌ సైబర్‌బీస్ట్‌’ మోడల్‌ (ధర దాదాపు రూ.1 కోటి) అక్టోబర్ నుంచి అందుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)