Breaking News

16.8 లక్షల కార్లను రీకాల్‌ చేసిన టెస్లా!

Published on Wed, 08/07/2024 - 13:47

ప్రముఖ ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ సంస్థ టెస్లా చైనాలో 16.8 లక్షల కార్లను రీకాల్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. సాఫ్ట్‌వేర్‌ అప్‌గ్రేడ్‌ చేయకపోవడం వల్ల సమస్య తలెత్తే అవకాశం ఉన్నట్లు తెలిపింది. రీకాల్‌ చేసిన కార్లులో ఉచితంగా సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్‌ చేసి ఇస్తామని పేర్కొంది.

టెస్లా తెలిపిన వివరాల ప్రకారం..చైనాలో దిగుమతి చేసుకున్న మోడల్‌ ఎస్‌, మోడల్ ఎక్స్‌ కార్లను రీకాల్‌ చేస్తున్నారు. వాటితోపాటు అక్టోబర్ 15, 2020 నుంచి జులై 17, 2024 మధ్య చైనాలో తయారు చేసిన మోడల్ 3, మోడల్ వై కార్లను కూడా రీకాల్ చేస్తున్నారు. అసోసియేటెడ్ ప్రెస్ నివేదిక ప్రకారం..డ్రైవింగ్ సమయంలో కారులో సామాన్లు పెట్టుకునేందుకు వీలుగా ఉండే ట్రంక్ డోర్‌ దానికదే తెరుచుకునే ప్రమాదం ఉంది. ఇది డ్రైవర్‌ దృష్టికి అంతరాయం కలిగిస్తుంది. అయితే ఇలాంటి సమస్య ఎక్కడ జరిగిందనే వివరాలను మాత్రం టెస్లా వెల్లడించలేదు. ఈ సమస్య పరిష్కారానికి రిమోట్‌ సాఫ్ట్‌వేర్‌ అప్‌గ్రేడ్‌ చేయాలని పేర్కొంది. రీకాల్‌ చేసిన కార్లలో ఉచితంగానే ఈ సర్వీసును అందిస్తామని చెప్పింది.

ఇదీ చదవండి: క్రెడిట్‌ కార్డుల వినియోగం ఎంతంటే..

ఇదిలాఉండగా, టెస్లాకు చైనా ప్రధాన మార్కెట్‌గా నిలుస్తోంది. జులైలో చైనా ప్రభుత్వం పెద్దమొత్తంలో ఈ కార్లను కొనుగోలు చేసింది. షాంఘైలో టెస్లా గిగాఫ్యాక్టరీని స్థాపించింది. 2023లో ఈ ఫ్యాక్టరీలో దాదాపు 9,47,000 కార్లు తయారు చేసింది. వీటిలో చాలా వరకు స్థానికంగా విక్రయించింది. మిగతావాటిని యూరప్‌కు ఎగుమతి చేసింది. చైనాకు చెందిన బీవైడీ కంపెనీ తయారు చేస్తున్న ఈవీ కార్లు టెస్లాకు పోటీగా నిలుస్తున్నాయి.

Videos

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)