Breaking News

భారత్‌లో టెస్లా షోరూం ప్రారంభం ఈ వారంలోనే..

Published on Fri, 07/11/2025 - 12:22

ఎలాన్మస్క్కు చెందిన ఎలక్ట్రిక్వాహన తయారీ సంస్థ టెస్లా భారత్లో తన తొలి షోరూంను వారంలోనేప్రారంభించనుంది. టెస్లా భారత్లో తన మొదటి "ఎక్స్పీరియన్స్ సెంటర్" ను జూలై 15న ముంబైలోని జియో వరల్డ్ డ్రైవ్లో ప్రారంభించనుందని, ఇది భారత మార్కెట్లోకి ప్రవేశించడంలో కీలక అడుగు అని రాయిటర్స్ నివేదించింది. ఇందుకోసం టెస్లా 4,000 చదరపు అడుగుల రిటైల్ స్థలాన్ని మార్చిలో లీజుకు తీసుకుంది. ఈ ప్రాంతం యాపిల్ స్టోర్ కు సమీపంలో ఉంది.

భారత్లో విస్తృత విస్తరణ వ్యూహంలో భాగంగా టెస్లా ఈ నిర్ణయం తీసుకుంది. జూన్ లో ముంబైలోని కుర్లా వెస్ట్ లో ఒక వాణిజ్య స్థలాన్ని కంపెనీ లీజుకు తీసుకుంది. ఇది వాహన సర్వీస్కేంద్రంగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. పుణెలో ఇంజనీరింగ్ హబ్, బెంగళూరులో రిజిస్టర్డ్ కార్యాలయం, బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ) సమీపంలో తాత్కాలిక కార్యాలయంతో సహా భారతదేశంలో టెస్లా మొత్తం వాణిజ్య ఆస్తులు నాలుగుకు చేరుకున్నాయి.

కాగా కంపెనీ ఇండియా హెడ్ ప్రశాంత్ మీనన్ తొమ్మిదేళ్ల తర్వాత గత నెలలో రాజీనామా చేశారు. బ్లూమ్బెర్గ్ న్యూస్ ప్రకారం.. ప్రస్తుతానికి భారత కార్యకలాపాలను చైనాకు బృందం నిర్వహిస్తోంది. అయితే టెస్లా ప్రస్తుతం భారత్లో తయారీని స్థాపించడానికి ఆసక్తి చూపడం లేదని, కేవలం షోరూమ్లు తెరిచి దిగుమతి చేసుకున్న కార్లను విక్రయించాలనుకుంటోందని కేంద్రమంత్రి కుమారస్వామి గత నెలలో చెప్పారు.

షోరూం ప్రారంభానికి ముందు కంపెనీ దాదాపు 1 మిలియన్ డాలర్ల (రూ.8.58 కోట్లు) ఎలక్ట్రిక్ వాహనాలు, సంబంధిత వస్తువులను దిగుమతి చేసుకుంది. జనవరి - జూన్ మధ్య వాణిజ్య షిప్పింగ్ రికార్డుల డేటా ప్రకారం.. టెస్లా భారత్కు వాహనాలు, సూపర్ ఛార్జర్లు, ఇతర ఉపకరణాలను దిగుమతి చేసుకుంది. ఇందులో ప్రధానంగా చైనా, అమెరికాల నుండి దిగుమతి చేసుకున్న ఆరు కార్లలో మోడల్ వై కార్లు ఉన్నాయి. విదేశీ ఎలక్ట్రిక్ వాహనాలపై భారత్ సుమారు 70% దిగుమతి సుంకం విధిస్తున్నప్పటికీ టెస్లా ఈ వాహనాలను తీసుకువస్తోంది.

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

కృష్ణాష్టమి సెలబ్రేషన్.. కిరణ్ అబ్బవరం కొడుకు ఇలా (ఫొటోలు

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)