Breaking News

‘లగ్జరీ కార్లను ఎలా విక్రయించాలో తెలియదు’

Published on Tue, 08/13/2024 - 10:20

ప్రముఖ ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ సంస్థ టెస్లా కార్లు ఇండియాలోకి ఎప్పుడు వస్తుయో ప్రశ్నార్థకంగా మారింది. దేశీయ రోడ్లపై టెస్లా పరుగులు పెడుతుందని నమ్మినవారిలో కొందరు ఇప్పటికే ప్రీ ఆర్డర్‌ చేసుకున్నారు. కానీ ఏళ్లు గడుస్తున్నా కార్ల రాకకు సంబంధించి స్పష్టత లేకపోవడంతో కస్టమర్లు తమ డిపాజిట్లను తిరిగి తీసుకుంటున్నారు. దాంతోపాటు ఇతర కంపెనీల నుంచి పోటీ పెరిగిందని చెబుతున్నారు.

జీఓక్యూఐఐ అనే హెల్త్‌ టెక్‌ స్టార్టప్‌ కంపనీ సీఈఓ గోండాల్‌ తెలిపిన వివరాల ప్రకారం..‘భారత్‌లో టెస్లా ప్రవేశిస్తుందని నమ్మి 1000 డాలర్లతో మోడల్‌ 3 కారును ప్రీబుకింగ్‌ చేసుకున్నాను. ఏప్రిల్‌ 2016లో టెస్లా కారు భారత్‌లోకి వస్తుందని నమ్మబలికారు. ముందుగానే ఆర్డర్‌ చేసుకోమని చెప్పారు. కానీ ఎనిమిదేళ్లు అవుతున్నా ఇప్పటికీ దానిపై స్పష్టత లేదు. భారత్‌లో దిగుమతి చేయాలంటే ఖరీదుతో కూడుకున్న విషయమని కంపెనీ గతంలో చెప్పింది. దాంతో స్థానికంగానే కార్లను తయారు చేస్తామని కూడా పేర్కొంది. కొన్ని కారణాలవల్ల ఆ నిర్ణయాన్ని వాయిదా వేసింది. ఇదే అదనుగా ఇతర పోటీ కంపెనీలు ఈవీలను తయారు చేసి మార్కెట్‌లో విడుదల చేస్తున్నాయి. టెస్లా ఫీచర్లకు పోటీ ఇచ్చేలా వాటిలో మెరుగైన టెక్నాలజీ వాడుతున్నారు. అసలు భారత్‌లోకి ఎప్పుడు వస్తుందో తెలియని కంపెనీ కార్ల కోసం వేచి చూడడం కంటే, దాదాపు అదే తరహా ఫీచర్లు అందించే ఇతర కంపెనీ కార్లును ఎంచుకోవడం మేలనిపించింది. దాంతో ప్రీ బుకింగ్‌ డబ్బును తిరిగి తీసుకున్నాను. టెస్లా గొప్ప టెక్ కంపెనీయే కావచ్చు. కానీ వారికి లగ్జరీ కార్లను ఎలా విక్రయించాలో తెలియదు’ అని అన్నారు.

ఇదీ చదవండి: సైబర్‌ట్రక్‌ ఆర్డర్ల నిలిపివేత!

ఇదిలాఉండగా, దేశీయంగా టాటా, మహీంద్రా, మారుతీసుజుకీ..వంటి కంపెనీలు ఈవీలను తయారు చేస్తున్నాయి. మార్కెట్‌లోనూ వాటికి గిరాకీ పెరుగుతోంది. దాంతోపాటు విదేశీ కంపెనీలైన బీవైడీ, మోరిస్‌గరేజ్‌, బెంజ్‌, బీఎండబ్ల్యూ..వంటివి ఈవీలో కొత్త మోడళ్లను తీసుకొచ్చాయి. భారత ప్రభుత్వం విదేశీ కంపెనీ కార్ల తయారీదారులను ఆకర్షించడానికి 2024 మార్చిలో దిగుమతి సుంకాలను 70% నుంచి 15%కు తగ్గించింది. దాంతో భారత్‌లో తయారయ్యే విదేశీ ఈవీ కార్ల ధర రూ.30 లక్షల కంటే తక్కువకే లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అయితే తయారీని ప్రారంభించే దిశగా మరిన్ని చర్చలు జరగాల్సి ఉందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)