Breaking News

టెస్లా రోబో కారు

Published on Fri, 10/11/2024 - 11:36

‘ఐ రోటోట్‌’ సినిమా చూశారా..? అందులో కార్లు డ్రైవర్‌ ప్రమేయం లేకుండానే వాటికవే ప్రయాణిస్తుంటాయి. వాటంతటవే పార్క్‌ చేసుకుంటాయి. అచ్చం టెస్లా కంపెనీ అలాంటి కార్లను తయారు చేయాలని భావిస్తోంది. అందులో భాగంగా తాజాగా ‘రోబోవన్‌’ అనే కారును ఆవిష్కరించారు. టెస్లాకు చెందిన ‘వి రోబోట్‌’ ఈవెంట్‌లో కంపెనీ సీఈఓ ఇలోన్‌మస్క్‌ ఈ కారుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.

కాలిఫోర్నియాలోని వార్నర్ బ్రదర్స్ లాట్‌లో జరిగిన ఈ ఈవెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అటానమస్ డ్రైవింగ్ పట్ల టెస్లా చేస్తున్న ఆవిష్కరణలు ప్రదర్శించేందుకు వేదికగా నిలిచింది. కంపెనీ సీఈఓ ఇలోన్ మస్క్ ఈ ఈవెంట్‌ను ‘ఫ్యూచర్‌ వరల్డ్‌’గా అభివర్ణించారు. ‘ఈ రోబోవన్‌ కారులో 20 మంది వరకు ప్రయాణించవచ్చు. ఇది డ్రైవర్‌లెస్‌ కారు. ఈ ఎలక్ట్రిక్‌ కారు పూర్తి ఆటోమేషన్‌ టెక్నాలజీతో పనిచేస్తుంది. వాణిజ్య, వ్యక్తిగత అవసరాల కోసం దీన్ని ఉపయోగించుకోవచ్చు’ అని మస్క్‌ తెలిపారు.

ఈమేరకు రోబోవన్‌ రోడ్లపై పరుగెత్తిన వీడియోను వివిధ సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేశారు. ఇందులో డ్రైవర్‌ క్యాబిన్‌ ఉండకపోవడం గమనించవచ్చు. ఈ ఈవెంట్‌లో సైబర్‌ క్యాబ్‌ను కూడా ఆవిష్కరించారు. ఈ సైబర్‌ క్యాబ్‌ను 2026లో ఉత్పత్తి చేయనున్నట్లు ఇలొన్‌మస్క్‌ తెలిపారు. రోబోటాక్సీగా ఉద్దేశించిన ఈ సైబర్‌క్యాబ్‌ను ఇండక్టివ్ ఛార్జర్ ద్వారా వైర్‌లెస్‌ విధానంలో ఛార్జ్‌ చేసేలా రూపొందించినట్లు అధికారులు పేర్కొన్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)