Breaking News

టాప్‌ ఈవీ తయారీ సంస్థ క్యూ1 ఫలితాలు ఎలా ఉన్నాయంటే..

Published on Tue, 04/23/2024 - 14:14

అమెరికాలోని టాప్‌ ఈవీ తయారీ కంపెనీగా పేరున్న టెస్లా ఇటీవల విడుదల చేసిన మొదటి త్రైమాసిక ఫలితాల్లో ఇన్వెస్టర్లకు షాకిచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా వినియోగదారులకు ఇచ్చిన హామీ మేరకు 3,87,000 యూనిట్లను డెలివరీ చేసినట్లు కంపెనీ తెలిపింది. అయితే క్యూ1 ఫలితాల్లో టెస్లా అమ్మకాలు అంతకు ముందు త్రైమాసికంతో పోలిస్తే 8.5 శాతం తగ్గాయి.  దాంతో కంపెనీ రెవెన్యూ భారీగా తగ్గిపోయింది. 

ఏడేళ్లలో కంపెనీ ఇంతలా నష్టపోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. రెవెన్యూ తగ్గడంతో ఇటీవల కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 10శాతం మందిని కొలువుల నుంచి తొలగించినట్లు టెస్లా ప్రకటించింది. అంటే సుమారు 14వేల మందికి ఉద్వాసన పలుకుతున్నట్లు కంపెనీ ప్రతినిధులు చెప్పారు. చైనా ఈవీ తయారీ సంస్థల నుంచి టెస్లాకు భారీ పోటీ నెలకొన్నట్లు తెలిసింది. చైనాతోపాటు అంతర్జాతీయంగా దిగ్గజ సంస్థలు ఈవీలను తయారుచేస్తున్నాయి. టెస్లాలో వాడుతున్న ఫీచర్లతోపాటు అదనంగా మరిన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాయి. దాంతో వినియోగదారులు ఇతర కంపెనీ ఉత్పత్తులు కొనేందుకు మొగ్గు చూపుతున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

పర్యటన వాయిదా..

టెస్లా చీఫ్‌ ఎలొన్‌ మస్క్‌ ఈ నెలలో భారత్‌లో పర్యటించనున్నారనే వార్తలు ఇటీవల వైరల్‌గా మారాయి. ఈమేరకు వీటిని ధ్రువీకరిస్తూ మస్క్‌ కూడా ట్విటర్‌ వేదికగా స్పందించారు. అయితే ఆ పర్యటనను వాయిదావేశారు. ఏప్రిల్‌ 23న అమెరికాలో టెస్లా ఇన్వెస్టర్ల సమావేశం ఉండడంతో ఈ పర్యటన వాయిదా పడిందని కొన్ని మీడియా సంస్థల్లో కథనాలు వచ్చాయి. 

మస్క్‌ భారత్‌లో రూ.16 వేలకోట్లు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. టెస్లా కంపెనీను భారత్‌లో ప్రవేశించేలా చేసేందుకు నిబంధనల్లో మార్పులు తీసుకురావాలని మస్క్‌ గతంలో ప్రధానితోపాటు ఇతర కేంద్రమంత్రులు, అధికారులతో సమావేశమైన సంగతి తెలిసిందే. విదేశీ కంపెనీలు భారత్‌లో ప్రవేశించేందుకు లైన్‌క్లియర్‌ చేస్తూ కేంద్రం కొత్త ఈవీపాలసీను రూపొందించింది. ఈ మేరకు కేంద్రం ఇటీవల ఆటోమొబైల్‌ తయారీ కంపెనీల అభిప్రాయాలను సైతం తీసుకున్నట్లు ప్రకటించింది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)