Breaking News

టెస్లా డ్రైవర్ లెస్ రోబోట్యాక్సీ సర్వీస్‌ ప్రారంభం

Published on Tue, 06/24/2025 - 11:58

ఎలక్ట్రిక్‌ కార్లు ఉత్పత్తి చేసే ప్రముఖ కంపెనీ టెస్లా టెక్సాస్‌లోని ఆస్టిన్‌లో తన మొట్టమొదటి ఫుల్‌ డ్రైవర్ లెస్ రోబోట్యాక్సీ సర్వీసులను ప్రారంభించినట్లు తెలిపింది. భవిష్యత్తులో రవాణా విభాగంలో కొత్త ట్రెండ్‌ సృష్టించాలని భావించి కంపెనీ సీఈఓ ఎలాన్‌ మస్క్‌ పదేళ్ల కిందటే ఈ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టడం గమనార్హం. ఈ ప్రాజెక్ట్‌ సిబ్బంది ముందుగా నిర్ణయించుకున్న ప్రణాళికలకు అనుగుణంగా ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ (ఎఫ్ఎస్‌డీ) సాఫ్ట్‌వేర్‌తో నడిచే మోడిఫైడ్ మోడల్ వై ఎస్‌యూవీలను తయారు చేశారు.

ప్రాథమికంగా కొంతకాలం కస్టమర్లలో నమ్మకం కలిగేంతవరకు ఈ ఎస్‌యూవీల పర్యవేక్షణ కోసం ప్యాసింజర్లతోపాటు టెస్లా ఉద్యోగులు సైతం అందులో ప్రయాణించనున్నారు. ముందుగా దక్షిణ ఆస్టిన్ వీధుల్లో టెస్లా ఈ సేవలు అందిస్తుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ప్రస్తుతం 10 నుంచి 20 వాహనాలను మాత్రమే పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద సెట్‌అప్‌ చేశారు. ప్రాథమికంగా దక్షిణ ఆస్టిన్ జియోఫెన్సింగ్ విభాగాన్ని కవర్ చేసే పరిమిత సర్వీసులను కంపెనీ అందిస్తుంది. క్రమంగా ప్యాసింజర్‌ ఫీడ్‌బ్యాక్‌ ఆధారంగా ఈ సర్వీసులను విస్తరిస్తామని అధికారులు పేర్కొన్నారు. ఈ డైవర్‌లెస్‌ కారు రైడ్‌లు ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉంటాయని టెస్లా పేర్కొంది. అయితే ప్రతికూల వాతావరణంలో మాత్రం నిలిపేస్తామని ముందే స్పష్టతనిచ్చింది.

రైడ్‌ ధర 4.20 డాలర్లు

ప్రతి రోబోటాక్సీ రైడ్ ఖరీదు 4.20 డాలర్లుగా నిర్ణయించారు. ప్రస్తుతానికి ప్యాసింజర్లను ఆకర్షించేందుకు ఈ ధర నిర్ణయించినప్పటికీ కస్టమర్ల నుంచి నెలకొనే డిమాండ్, రెగ్యులేటరీ నిబంధనలు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని భవిష్యత్తులో మార్పులు చేసే అవకాశం ఉందని పేర్కొంది.

ఇదీ చదవండి: పైప్‌లైన్‌ కోసం రూ.844 కోట్లు పెట్టుబడి!

నో లైడార్, నో రాడార్ ఓన్లీ కెమెరా..

ఇప్పటికే స్థానికంగా సెల్ఫ్‌ డ్రైవింగ్‌ ట్యాక్సీ సర్వీసులు అందిస్తున్న వేమో, జూక్స్ వంటి ప్రత్యర్థి కంపెనీలు వాటి కార్లలో ఉపయోగించినట్లు  లైడార్ లేదా రాడార్‌ వ్యవస్థలను టెస్లా వినియోగించలేదని స్పష్టం చేసింది. అందుకు బదులుగా పూర్తి కెమెరాలు, అంతర్గత ఏఐ చిప్‌లతోనే డ్రైవింగ్‌ వ్యవస్థ ఉంటుందని చెప్పింది. అటానమస్ వాహనాలకు పర్మిట్లు తప్పనిసరి చేసే కొత్త టెక్సాస్ చట్టం సెప్టెంబర్‌లో అమల్లోకి రానున్న నేపథ్యంలో ఈ ప్రయోగాన్ని ప్రారంభించినట్లు కొందరు చెబుతున్నారు.

Videos

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)