Breaking News

దివాలా దిశగా అగ్రరాజ్యం!

Published on Sat, 07/27/2024 - 11:21

ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన దేశంగా అమెరికాకు గుర్తింపు ఉంది. అది అలా వృద్ధి చెందడానికి అప్పులు కూడా ఒక కారణం. ఏంటీ..ఆశ్చర్య పోతున్నారా? అవును..అమెరికా అప్పులతోనూ ఎదిగినట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి. ఏటా ఆ దేశం కట్టే వడ్డీలే అందుకు నిదర్శనం. జూన్‌ 2024 లెక్కల ప్రకారం..దేశీయంగా వసూలైన వ్యక్తిగత ఆదాయపు పన్నులో 76 శాతం అంటే జాతీయ రుణాన్ని చెల్లించేందుకే వెచ్చిస్తోంది. ఈమేరకు ఎక్స్‌లో పోస్ట్‌లు వెలిశాయి. వాటిని ధ్రువపరిచేలా ప్రముఖ ​వ్యాపారవేత్త ఇలొన్‌మస్క్‌ ‘అమెరికా దివాలా దిశగా ప్రయాణిస్తోంది’ అంటూ స్పందించారు. దాంతో ఈ ట్వీట్‌ మరింత వైరల్‌గా మారింది.

పెరుగుతున్న జాతీయ రుణం అమెరికాలో చాలా కాలంగా ప్రధాన సమస్యగా ఉంది. టెస్లా సీఈఓ ఇలొన్ మస్క్ ఈ విషయాన్ని గతంలోనూ చాలాసార్లు తెలిపారు. తాజాగా ‘అమెరికా దివాళా దిశగా వెళ్తోంది’ అంటూ పీటర్‌ స్టాంజ్‌ అనే వ్యక్తి అప్‌లోడ్‌ చేసిన పోస్ట్‌లోని వివరాలను ధ్రువపరుస్తూ స్పందించారు. అమెరికా వ్యక్తిగత ఆదాయపన్ను వసూళ్లలో దాదాపు 76 శాతం జాతీయ రుణ చెల్లింపులకే ఖర్చు చేస్తున్నట్లు పీటర్‌ చెప్పారు. అమెరికా అప్పుల్లో కూరుకుపోయేందుకు కారణం మాజీ అమెరికా అధ్యక్షులు ఫ్రాంక్లిన్‌ డీ రూజువెల్ట్‌, రిచర్డ్‌ నిక్సన్‌ అని అన్నారు.

1970 కాలంలో అమెరికా ప్రెసిడెంట్‌గా ఉన్న రిచర్డ్‌ నిక్సన్ దేశీయ విధానాల కంటే విదేశీ వ్యవహారాలపై ఎక్కువ ఆసక్తి చూపేవాడు. ఓటర్లు తమ సొంత ఆర్థిక స్థితిపైనే దృష్టి సారిస్తారని నమ్మాడు. అప్పటికే దేశంలో పెరిగిన ద్రవ్యోల్బణం తిరిగి తన ఎన్నికకు ముప్పుగా మారుతుందని గ్రహించాడు. దాంతో ‘న్యూ ఫెడరలిజం’ విధానాలు అమలు చేశాడు. అందులో భాగంగా రాష్ట్రాలకు ప్రత్యేకంగా గ్రాంట్లను ప్రతిపాదించాడు. ఫలితంగా అమెరికా అప్పులు మూటగట్టుకుంది. రూజ్‌వెల్ట్ అధ్యక్ష పదవిలో ఉన్నపుడు సంపన్నులపై పన్ను రేట్లను 79%కు పెంచారు. ధనవంతులు ఈ రేటును తగ్గించుకోవడానికి ఇతర మార్గాలను ఎంచుకున్నారు. దాంతోపాటు అమెరికాలో ప్రైవేట్‌ పెట్టుబడులు తగ్గాయి. ఫలితంగా ఉద్యోగ కల్పన కుంటుపడింది. నిరుద్యోగం పెరిగింది.

ఇదీ చదవండి: ట్రేడింగ్‌ చేస్తున్నారా.. జాగ్రత్త!

పీటర్‌ స్టాంజ్‌ ఎక్స్‌లో అప్‌లోడ్‌ చేసిన వీడియోపై పీటర్ షిఫ్ అనే క్రిప్టో విమర్శకుడు స్పందించాడు. ‘అమెరికా అప్పులు అక్కడితో ఆగవు. త్వరలో ఫెడరల్ పన్ను ఆదాయంలో 100% రుణవడ్డీని చెల్లించడానికే వెచ్చిస్తారు. అన్ని ప్రభుత్వ ఖర్చుల కోసం అప్పు చేయాల్సిందే. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ ద్రవ్యోల్బణం, అప్పులను పరిశీలిస్తోంది’ అన్నారు. జూన్ 2024లో యూఎస్‌ ప్రభుత్వం ట్రెజరీ సెక్యూరిటీలపై 140.238 బిలియన్‌ డాలర్లు (రూ.11 లక్షల కోట్లు) వడ్డీ చెల్లించింది. ప్రభుత్వం అదే నెలలో వ్యక్తిగత ఆదాయ పన్నుల రూపంలో 184.9 బిలియన్‌ డాలర్లు(రూ.15.4 లక్షల కోట్లు) వసూలు చేసింది.

Videos

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)