Breaking News

టర్మ్‌ ఇన్సూరెన్స్‌ ఇప్పుడు చేస్తేనే ఎక్కువ ప్రయోజనం

Published on Mon, 11/17/2025 - 07:21

ఇప్పుడిప్పుడే కెరియర్లో పురోగమిస్తూ, కుటుంబాలను ఏర్పర్చుకునే దశలో ఉన్న యువతకు సాధికారత కల్పించేందుకు టర్మ్‌ ఇన్సూరెన్స్‌ తోడ్పడుతుందని ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ ఇన్సూరెన్స్‌ (ఏబీఎస్‌ఎల్‌ఐ) ఎండీ కమలేష్‌ రావు తెలిపారు. వాస్తవానికి 26–35 ఏళ్ల వయస్సు గ్రూప్‌లోని వారు దీర్ఘకాలికంగా ఆర్థిక భరోసాను కల్పించే టర్మ్‌ ఇన్సూరెన్స్‌ తీసుకోవడంలో కొంత వెనుకబడుతున్నారని తమ సర్వేలో వెల్లడైందని చెప్పారు.

ఈ సర్వే ప్రకారం 2025 మార్చి ఆఖరు నాటికి ప్రతి నలుగురు టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీహోల్డర్లలో ఈ వయస్సు గ్రూప్‌లోని వారు ఒకరే ఉంటున్నారని (మొత్తం పాలసీదారుల్లో 25.24 శాతం) వెల్లడైనట్లు పేర్కొన్నారు. ఇది చెప్పుకోతగిన స్థాయే అయినప్పటికీ 36–45 ఏళ్ల గ్రూప్‌ వారి వాటా అత్యధికంగా 41.68 శాతంగా, 46–55 ఏళ్ల గ్రూప్‌ వారి వాటా 23.96 శాతంగా ఉందని తెలిపారు.

ఈఎంఐలు, ఇతరత్రా ఖర్చులు, పొదుపు లక్ష్యాలు మొదలైన వాటి కారణంగా అప్పుడప్పుడే కాస్త అధికంగా ఆర్జించడం మొదలుపెట్టిన వారు కీలకమైన కవరేజీని పెద్దగా పట్టించుకోవడం లేదని దీని ద్వారా తెలుస్తోందని పేర్కొన్నారు. సాధారణంగా బీమాకు సంబంధించి  చిన్న వయస్సులో ప్రీమియంలు, ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. అదే వయస్సు పెరిగి అదే నలభైలు, యాభైల్లోకి వచ్చినప్పుడు ప్రీమియంలు పెరిగిపోతాయి.

ఈ విషయాలను యువతకు సమర్ధవంతంగా తెలియజేయడంతో పాటు బీమా కేవలం రక్షణ కవచంగానే కాకుండా ఆకాంక్షలను నెరవేర్చుకునే సాధనంగా కూడా ఉపయోగపడుతుందనే విషయాన్ని బీమా సంస్థలు సైతం వివరించాల్సి ఉంటుందని కమలేష్‌ రావు చెప్పారు. ఇందుకోసం వెల్‌నెస్‌ బెనిఫిట్స్, పొదుపునకు ఉపయోగపడే రైడర్లు, జీవితంలోని దశలను బట్టి కాలవ్యవధులను మార్చుకునే ఆప్షన్లు మొదలైనవి ఆఫర్‌ చేయాల్సి ఉంటుందన్నారు. 

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)