Breaking News

రిలయన్స్ స్కాలర్‌షిప్‌లో మెరిసిన తెలుగు విద్యార్థులు

Published on Sat, 12/28/2024 - 17:02

రిలయన్స్ ఫౌండేషన్ (Reliance Foundation) ప్రఖ్యాత అండర్‌గ్రాడ్యుయేట్ స్కాలర్‌షిప్‌లు (scholarship) 2024-25 బ్యాచ్‌కు సంబంధించిన ఫలితాలను తాజాగా ప్రకటించింది. దేశవ్యాప్తంగా సుమారు లక్ష మంది ఈ స్కాలర్‌షిప్‌నకు దరఖాస్తు చేసుకోగా 5,000 మంది ప్రతిభావంతులైన అండర్‌గ్రాడ్యుయేట్ విద్యార్థుల‌ను రిలయన్స్ ఫౌండేషన్ ఎంపిక చేసింది.

విద్యలో నాణ్యత, నాయకత్వ నైపుణ్యాలను పెంపొందించి యువత భవిష్యత్తును తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన రిలయన్స్ ఫౌండేషన్ పదేళ్లలో 50,000 స్కాలర్‌షిప్‌లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది దేశంలోనే అతిపెద్ద ప్రైవేటు స్కాలర్‌షిప్ కార్యక్రమంగా గుర్తింపు పొందింది. విద్యను సమాన అవకాశాలను అందించేందుకు మార్గంగా మార్చేందుకు రిలయన్స్ ఫౌండేషన్ నిబద్ధతను ఈ ప్రోగ్రామ్ నొక్కిచెబుతోంది.

దేశం నలుమూలల నుంచి ఎంపికైన 5000 మంది విద్యార్థులకు ట్యూషన్, హాస్టల్, ఇతర విద్యా ఖర్చుల కోసం ఈ కార్యక్రమం ద్వారా రూ. 2 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తారు. ఎంపికైన విద్యార్థుల్లో 70% మంది రూ. 2.5 లక్షల కంటే తక్కువ వార్షికాదాయం కలిగిన కుటుంబాలనుంచి రావడం విశేషం.

రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల (Telugu states)  విద్యార్ధులు తమ ప్రతిభతో 2024-25 బ్యాచ్‌లో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచారు. 850 మంది విద్యార్థులతో ఆంధ్రప్రదేశ్ దేశంలో 1వ స్థానంలో నిలవగా, 411 మంది విద్యార్థులతో తెలంగాణ 4వ స్థానం సాధించింది. రెండు తెలుగు రాష్ట్రాలలో మొత్తం 1,261 మంది అభ్యర్ధులు (25.22%) స్కాలర్‌షిప్ సాధించారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)